Movie News

ఆస్కార్ రూటు… ఇప్పుడు మరింత స్వీటు

భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే అదృష్టం కలగడం లేదు. ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి రెండు మూడు విభాగాల్లో ఆస్కార్ గౌరవం ఆశించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా కేవలం చెల్లో షో అనే గుజరాతి మూవీ మాత్రమే నామినేట్ కావడంతో ఆర్ఆర్ఆర్ కు బెస్ట్ మూవీ క్యాటగిరీలో అవకాశం మిస్సయ్యింది. అయినా సరే నాటు నాటు పాటకు అవార్డు సాధించారు.

ఇకపై ఈ టెన్షన్ ఉండదు. కేన్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ పురస్కారాలు దక్కించుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ కమిటీకి అప్లై చేసుకోవచ్చు. అంతే కాదు ఒక దేశం నుంచి ఒక్కో క్యాటగిరీలో ఒకే సినిమా పరిమితిని కూడా తీసేశారు. ఇది నటులకు కూడా వర్తిస్తుంది. అంటే ఒక సంవత్సరంలో ఒక యాక్టర్ రెండు సినిమాల్లో గొప్పగా నటించాడనుకుంటే తన అర్హతని బట్టి రెండింటికి నామినేట్ చేయొచ్చు సో గెలుపు అవకాశాలు పెరుగుతాయి.

ఇది వారణాసి, రాకా, రామాయణ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కే కాదు పెద్ది లాంటి రూటెడ్ సినిమాలకు సైతం లబ్ది చేకూరుస్తుంది. రాజమౌళి కోరుకున్నది ఇదే. ఆర్ఆర్ఆర్ కు ఎదురైన అడ్డంకులను ఆయన ప్రత్యక్షంగా చూశారు. వాటిని దాటుకోవడానికి ఎంతో సమయం, డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆస్కార్ కు వెళ్ళడానికి ముందే ట్రిపులార్ ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుని అవార్డులు సాధించింది. అవే కొంతమేర దోహదపడ్డాయి.

ఈ పరిణామాల పట్ల మూవీ మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియానే దీని నుంచి ఎక్కువ లబ్ది పొందుతుందని చెప్పొచ్చు. కాకపోతే అకాడమీ సభ్యులకు ఇకపై ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టం కానుంది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చూసి జల్లెడ పట్టాల్సి ఉంటుంది. అది కూడా వేర్వేరు దేశాల నుంచి వచ్చిన వేర్వేరు సినిమాలను. మరి ఇంత గొప్ప అవకాశాన్ని రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

This post was last modified on May 2, 2026 12:19 pm

Share

Recent Posts

ఆమెతో సారీ చెప్పించిన ‘ఆదర్శ కుటుంబం’

గత శుక్రవారం రిలీజైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే ఈ…

5 minutes ago

11.11.11.11 వెనక కారణం ఏంటో చెప్పిన సాయి రెడ్డి

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్టీ ఏర్పాటు ముహూర్తం చర్చగా మారడం తెలిసిందే. విజయసాయి వైసీపీలోనూ, జగన్…

33 minutes ago

స్నేహం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన లక్ష్మి

సంతోషంలో చాలా మంది చుట్టూ చేరుతారు, ఆపదలో వున్నప్పుడు అండగా నిలబడేది స్నేహితుడు ఒక్కడే. ఆ సత్యాన్ని అక్షరాలా నిరూపించింది…

59 minutes ago

ఆప‌ద వేళ‌.. అర్ధ‌రాత్రి వ‌ర‌కు… చంద్ర‌బాబు రివ్యూలు!

మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో…

3 hours ago

చిరు లిస్టులోకి ఇంకో పేరు

70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ…

4 hours ago

లాస్ట్ మినిట్ డైరెక్టర్లకు సెన్సార్ షాక్

మేకింగ్ టైంలో మాత్రం తాపీగా షూటింగ్ చేయడం.. అవసరం లేని షాట్లు తీసుకోవడం.. యాక్టర్ల డేట్లు వేస్ట్ చేయడం.. రీషూట్లు…

4 hours ago