Movie News

గోదారి కుర్రోడు గట్టెక్కిస్తాడా

నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి వచ్చేస్తుంది కానీ ప్రస్తుతానికి అద్భుతాలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఉన్నంతలో జెట్లీ, గాయపడ్డ సింహంకు బుక్ మై షోలో టికెట్లు అమ్ముడుపోతూ ట్రెండింగ్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇది కనీసం ఒక వారం ఉంటుందా అంటే గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక బయ్యర్ల దృష్టి రాబోయే శుక్రవారం మే 8 వైపు వెళ్తోంది.

ఆ రోజు కూడా ఉన్నవి చిన్న సినిమాలే. మేం ఫేమస్ తో పరిచయమైన సుమంత్ ప్రభాస్ హీరోగా రూపొందిన ‘గోదారి గట్టు’పైన మే 8 థియేటర్లకు రానుంది. పబ్లిసిటీ వెరైటీగా చేస్తూ సోషల్ మీడియా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ యూత్ లవ్ స్టోరీలో జగపతిబాబు, లైలా లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఉంది. ట్రైలర్ చూస్తే డబ్బున్న అమ్మాయి ఆటో డ్రైవర్ ప్రేమలో పడటమనే పాయింట్ చూపించారు.

టైటిల్ క్యాచీగా ఉండటం, ట్రెండ్ ని అనుసరించి హీరో హీరోయిన్ పాత్రలు డిజైన్ చేసుకోవడం కొంతవరకు పాజిటివ్ గా అనిపిస్తున్నప్పటికీ ఆడియన్స్ లో పూర్తి స్థాయి అటెన్షన్ రావాలంటే మాత్రం ప్రమోషన్స్ పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వీకెండ్ తప్పించి మాములు రోజుల్లో కనీస సంఖ్యలో జనాన్ని రప్పించడంలో తెలుగు సినిమాలు ఫెయిలవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ఒకటి రెండు మినహాయించి అన్నీ సోసోగానే ఆడాయి.

ఇప్పుడు గోదారి గట్టుమీద కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్ వసూళ్లతో రెట్టింపు స్థాయిలో బడ్జెట్ రికవరీ చేసుకోవచ్చు. పెద్దగా పోటీ కూడా లేదు. లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్ పోషించిన ‘సతి లీలావతి’ కొంచెం ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. కాకపోతే గ్రౌండ్ లెవల్ బజ్ అయితే సున్నానే. రవిబాబు ‘రేజర్’ కూడా తక్కువంచనాలతో అడుగు పెడుతోంది. బిగ్ స్క్రీన్ మీద సర్ప్రైజ్ చేస్తానని అంటున్నారు. మరి వీటిని దాటుకుని ఫైనల్ గా గోదారి కుర్రాడు ఏం చేస్తాడో చూడాలి.

This post was last modified on May 2, 2026 11:26 am

Share

Recent Posts

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

3 minutes ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

6 minutes ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

58 minutes ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

3 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

4 hours ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

4 hours ago