Movie News

సంక్రాంతిని వదలనంటున్న రావిపూడి

పోయినేడాది సంక్రాంతి పండక్కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు అనిల్ రావిపూడి. అలాంటి ఫ్యామిలీ టాక్ వచ్చిన మిడ్ రేంజ్ మూవీతో రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టడం చూసి ట్రేడ్ వర్గాలు షాకయ్యాయి. ఈసారి పండక్కి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో దాన్ని మించి ప్రకంపనలు రేపాడు రావిపూడి.

ఈసారి ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఈ ఏడాదికి ఇప్పటిదాకా అదే తెలుగు నుంచి హైయెస్ట్ గ్రాసర్.
గతంలో సంక్రాంతికే ‘ఎఫ్-1’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతోనూ భారీ వసూళ్లు రాబట్టిన ఘనత అనిల్ సొంతం. ఈ తరం దర్శకుల్లో ఈ పండుగను ఇంత బాగా ఉపయోగించుకున్న దర్శకుడు మరొకరు కనిపించరు. ఈ విషయంలో చాలామంది అనిల్‌ను చూసి అసూయ చెందుతుంటారు.

పండుగ వల్లే అనిల్ తీసే మామూలు సినిమాలు కూడా తెగ ఆడేస్తున్నాయంటూ సెటైర్లు వేస్తుంటారు. కానీ కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తీయడంలో తన నైపుణ్యాన్ని తక్కువ చేసి చూడకూడదు.
సంక్రాంతితో ఇలాంటి బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకున్న అనిల్.. తన తర్వాతి సినిమాను కూడా ఆ పండక్కే రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ కొత్త సినిమాను రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడమే సంక్రాంతి రిలీజ్ అని చెప్పేశారు. కానీ ఏప్రిల్ పూర్తి కావస్తున్నా ఇంకా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లని నేపథ్యంలో వచ్చే సంక్రాంతి రిలీజ్ టార్గెట్ అందుకోవడం కష్టమని.. వేసవికి వాయిదా వేయబోతున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది.

ఐతే ఈ ఊహాగానాలు ఇలా మొదలయ్యాయో లేదో.. వెంటనే టీం క్లారిటీ ఇచ్చేసింది. నూటికి నూరు శాతం సంక్రాంతికే సినిమా రిలీజవుతుందని స్పష్టం చేసింది.
సంక్రాంతికి తన మార్కు ఫ్యామిలీ సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో అనిల్ కంటే ఈ తరం దర్శకుల్లో ఎవరికి బాగా తెలుసు. సినిమా తీయడం కోసం అతను ఎక్కువ టైం కూడా తీసుకోడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు కూడా ఏడాది ఆరంభంలో స్క్రిప్టు పని మొదలుపెట్టాడు. వేసవి చివర్లో షూట్‌కు వెళ్లాడు. ఏడాది చివరికల్లా సినిమాలను విడుదలకు రెడీ చేసేశాడు. వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమా విషయంలోనూ అదే ప్లానింగ్‌తో వెళ్తున్నాడు. కాబట్టి ఈసారి కూడా తన ప్లాన్ మారే అవకాశాలు లేవు. 100 శాతం ఈ చిత్రం కూడా సంక్రాంతికే వస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి ఏ డౌట్లూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

This post was last modified on April 29, 2026 3:30 pm

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

49 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

2 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

3 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

3 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

4 hours ago