Movie News

అనుకున్నట్టే బాంబు పేల్చిన ‘టాక్సిక్’

గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు హీరో యష్, నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించారు. కొత్త డేట్ ప్రస్తావించలేదు కానీ త్వరలో అని మాత్రమే చెప్పారు. అది ఆగస్ట్ అవుతుందా లేక అంతకన్నా ఆలస్యం అవుతుందా అనేది ఎవరికీ తెలియదు. చాలా సుదీర్ఘమైన మెసేజ్ పెట్టిన యష్ క్వాలిటీ సినిమా ఎక్కువ సమయం డిమాండ్ చేస్తుందని అందుకే పోస్ట్ పోన్ తప్పలేదని పేర్కొన్నాడు.

గత ఏడాది నుంచి లెక్కేసుకుని ఇప్పటికే మూడు నాలుగు సార్లు మనసు మార్చుకున్న టాక్సిక్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్,. బెంగళూరు వర్గాల కథనం ప్రకారం టాక్సిక్ ఓటిటి డీల్ ఇంకా అవ్వలేదు. ప్రొడక్షన్ హౌస్ చెబుతున్న మొత్తానికి, డిజిటల్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందట. ప్రీమియర్ వేయకుండా ఎక్కువ రేట్ చెప్పడం ఓటిటిల వెనుకడుగుకు కారణమని వినికిడి. అందుకే ఆగాలని నిర్ణయించుకున్నారట.

కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకోవడంతో టాక్సిక్ విషయంలో యష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అయినప్పటికీ తను కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఏ చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటున్నాడట. అయితే దీపావళికి రామాయణ పార్ట్ 1 విడుదల కాబోతున్న నేపథ్యంలో దానికన్నా కనీసం మూడు నెలల ముందు టాక్సిక్ వస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సో జూన్ 4 స్లాట్ ఖాళీ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తారో చూడాలి. ఆల్రెడీ సత్యదేవ్ రావు బహద్దూర్ ఇది ముందే ఊహించి జూన్ 5 లాక్ చేసుకుంది. ఇప్పుడీ రేస్ లో ఒకరో ఇద్దరో జాయిన్ అయినా ఆశ్చర్యం లేదు. ఈ డేట్ కి పెద్ది వచ్చి ఉంటే బాగుండేదని జనాలు అభిప్రాయపడుతున్నారు కానీ దర్శకుడు బుచ్చిబాబు జూన్ 25 అని ఇటీవలే చెప్పేశాడు. సో ఈ ఛాన్స్ లేనట్టే. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి తదితరులు టాక్సిక్ లో కీలక పాత్రలు పోషించారు.

This post was last modified on April 29, 2026 12:21 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

29 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago