బూతు టచ్ ఉన్న లో బడ్జెట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో దర్శకుడిగా తన ప్రయాణం ఆరంభించాడు దాసరి మారుతి. ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుని.. ఆ తర్వాత రూటు మార్చి ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అందిస్తున్నాడతను. ‘భలే భలే..’ తర్వాత మారుతి నుంచి మహానుభావుడు, ప్రతి రోజూ పండగే లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చాయి.
తన సినిమాలకు ఆకర్షణీయమైన టైటిళ్లు పెట్టడంలో మారుతి సిద్ధహస్తుడు. టైటిల్ దగ్గర్నుంచి ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు మారుతి. తన కొత్త సినిమాకు మారుతి క్యాచీ టైటిల్ పెట్టినట్లు సమాచారం. కమర్షియల్ సినిమాలు తీయడంలో నిపుణుడైన మారుతి.. తన కొత్త చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అని టైటిల్ పెట్టాడట.
ఈ టైటిల్ చూస్తేనే ఇది మాంచి మాస్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. హీరోలకు తనదైన శైలి క్యారెక్టరైజేషన్లు సెట్ చేసి వాటి ద్వారా ఎంటర్టైన్ చేయడం మారుతి స్టైల్. పక్కా కమర్షియల్ అనే టైటిల్ చూస్తే ఇందులో హీరో బాగా కమర్షియల్ అయి ఉంటాడనిపిస్తోంది. ఈ టైటిల్‌తో రవితేజ హీరోగా సినిమా తీయాలని మారుతి అనుకున్నాడు. అతడికి మాతృ సంస్థ అనదగ్గ గీతా ఆర్ట్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఐతే పారితోషకం దగ్గర తేడా వచ్చి రవితేజ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు వార్తలొస్తున్నాయి.
రవితేజ స్థానంలోకి ముందు నాని వస్తాడని ప్రచారం జరగ్గా.. ఆ తర్వాతేమో గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. ఎక్కువగా సీరియస్ సినిమాలు చేసే గోపీచంద్.. మారుతితో జట్టు కడితే కాంబినేషన్ భిన్నంగానే ఉంటుంది. గోపీచంద్ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్నాడు. అతను ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 28, 2020 6:05 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…