సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యాక.. 40 ప్లస్ వయసులో యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడి.. భర్త నుంచి విడాకులు పొంది సంచలనం రేపిన బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రేమలో పడటానికి వయసు అంతరం, కుటుంబ బంధాలు అడ్డంకి కాదని వీళ్లిద్దరూ రుజువు చేశారు. నాలుగైదేళ్లుగా వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఇంతకుముందు తమ బంధాన్ని బయటపెట్టడానికి జంకేవారు కానీ.. ఈ మధ్య అలాంటిదేమీ కనిపించడం లేదు. ఇద్దరూ కలిసి బయట స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. విహార యాత్రలకూ వెళ్తున్నారు. కరోనా వల్ల లాక్ డౌన్ అమలయ్యాక వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ సంగతి బహిరంగ రహస్యమే. ఐతే దాని గురించి వీళ్లిద్దరూ ఓపెన్ అయింది లేదు. తాజా మలైకా ఓ ఇంటర్వ్యూలో తన క్వారంటైన్ అనుభవాల గురించి మాట్లాడింది.
మీరు క్వారంటైన్లో సుదీర్ఘ కాలం కలిసి ఉండాలంటే ఏ నటుడిని ఎంచుకుంటారు అని మలైకాను అడిగితే.. కొత్తగా ఎవరినో ఏంటి, తాను నిజంగానే ఓ నటుడితోనే క్వారంటైన్ రోజులను గడిపానని మలైకా చెప్పింది. ఆ నటుడు అర్జున్ కపూర్ అని చెప్పకుండా.. పరోక్షంగా అతడితో తన క్వారంటైన్ అనుభవాలను పంచుకుంది మలైకా.
‘‘నిజం చెప్పాలంటే.. నేను నిజంగానే ఓ నటుడితో కలిసి క్వారంటైన్లో ఉన్నాను. అతను చక్కటి వినోదాన్నిచ్చే వ్యక్తి. అతడితో ఉంటే ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. నన్ను చూసి ఎంతసేపూ కామెడీ చేస్తుంటాడు. నన్ను నవ్విస్తూ ఉంటాడు. అతనంత సరదా వ్యక్తిని నేను చూడలేదు’’ అని మలైకా చెప్పింది. కొన్ని నెలల కిందట మలైకా కరోనా బారిన పడ్డట్లు మీడియాకు సమాచారం అందగా.. అర్జున్ కపూర్ సైతం వైరస్ బారిన పడే ఉంటాడని అంతా అనుకున్నారు. తర్వాత అదే నిజమని తేలింది. ఇద్దరూ తమ ఫ్లాట్లో క్వారంటైన్లో ఉండి కోలుకున్నారు.
This post was last modified on December 28, 2020 6:00 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…