బంగార్రాజు సినిమా గురించి చర్చ ఈనాటిది కాదు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ విడుదలై భారీ విజయం అందుకున్న కొన్ని నెలల నుంచే.. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన బంగార్రాజు బ్యాక్ స్టోరీతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ స్క్రిప్టు మీద దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల మూడేళ్లకు పైగానే పని చేస్తున్నాడు. కానీ దాన్ని నాగార్జున ఓ పట్టాన ఓకే చేయట్లేదు. ఈ సినిమా చేయడం పక్కా, అది కూడా సొంత బేనర్లోనే అంటున్నాడే తప్ప.. స్క్రిప్టుకు ఆమోద ముద్ర వేసి షూటింగ్ మాత్రం మొదలుపెట్టట్లేదు.
‘బంగార్రాజు’ స్క్రిప్టు ఓకే అయిందని, ఇక షూటింగే మొదలు కావడమే ఆలస్యం అని వార్తలు రావడం.. ఆ తర్వాత బ్రేక్ పడటం .. ఇలా చాలాసార్లు జరిగింది ఇప్పటికే. దీంతో ‘బంగార్రాజు’ వార్తలపై జనాలకు కూడా ఆసక్తి సన్నగిల్లిపోయింది. మొదలైనపుడు చూసుకుందాంలే అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు.
ఐతే అక్కినేని వారి కాంపౌండ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఎట్టకేలకు 2021 ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కబోతోందట. నాగార్జున ఇటీవలే స్క్రిప్టు లాక్ చేయించారని.. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని.. సంక్రాంతి తర్వాత ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. నాగ్ ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ సినిమాను పూర్తి చేసి ‘బిగ్ బాస్’ పని కూడా ముగించి ఖాళీ అయ్యారు. ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ.. అదెప్పుడన్నదానిపై క్లారిటీ లేదు. ఈలోపు ఆయన ‘బంగార్రాజు’ను పట్టాలెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.
స్క్రిప్టు ఓకే అయిపోవడంతో కళ్యాణ్ సంగీత దర్శకుడు అనూప్‌తో కలిసి సంగీత చర్చలు కూడా జరుపుతున్నాడట. ‘సోగ్గాడే..’కు అతనందించిన సంగీతం పెద్ద ప్లస్ అయిన సంగతి తెలిసిందే. అంతా ఓకే అనుకుంటే ఈ చిత్రంలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి. రమ్యకృష్ణ పాత్ర ఇందులోనూ కొనసాగుతుందట.
This post was last modified on %s = human-readable time difference 10:52 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…