Movie News

వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?

తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ ఆమోదం పొందుతున్న సినిమాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఏవో కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి ఆడేస్తున్నాయి తప్ప.. వందలో 90 అంతకంటే ఎక్కువ సినిమాలు బోల్తా కొట్టేస్తున్నాయి.

డిజిటల్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోవడంతో సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతోంది. అవసరం లేని భారీతనం, హంగులు, ప్లానింగ్ లోపం వల్ల.. బాగా పెరిగిపోతున్న వర్కింగ్ డేస్ వల్ల బడ్జెట్లు కొండెక్కేస్తున్నాయి. కానీ బిజినెస్ మాత్రం అనుకున్నట్లుగా జరగట్లేదు. ఇలా అనేక అడ్డంకులను దాటి సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తే.. వాటిని చూసేందుకు ప్రేక్షకులు రావట్లేదు.

ఆడియన్స్‌ను ఎగ్జైట్ చేసే కంటెంట్ ఉన్న సినిమాలు తగ్గిపోతున్నాయి. కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నప్పటికీ.. చివరికి కంటెంట్‌తో మెప్పించలేకపోతున్నాయి. అసంతృప్తితో ప్రేక్షకులు బయటికి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ వరకు ఓమాదిరిగా థియేటర్లలో జనం కనిపిస్తున్నారు. తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి.

మళ్లీ వీకెండ్ కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. టాలీవుడ్ అనే కాదు.. బాలీవుడ్‌లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు వైభవం చూసిన కోలీవుడ్లోనూ ఈ మధ్య సక్సెస్ రేట్ బాగా పడిపోయింది.

కానీ మలయాళ సినీ పరిశ్రమలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం. దేశంలో మిగతా ఇండస్ట్రీలన్నీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండగా.. మలయాళ సినిమాలు మాత్రం వెలిగిపోతున్నాయి. అంతకంతకూ వాటి పరిధి పెరుగుతోంది. చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు రాబడుతున్నాయి. గత నెల రోజుల్లో ఆడు-3, వాళ-2 చిత్రాలు భారీ కలెక్షన్లు రాబట్టాయి. రెండూ వంద కోట్ల మార్కును దాటాయి.

తాజాగా ‘భరతనాట్యం-2’ సినిమా మంచి వసూళ్లతో సాగిపోతోంది. వేరే ఇండస్ట్రీలు బాగా స్ట్రగుల్ అవుతున్న సమయంలో మలయాళ చిత్రాలు మాత్రం అదరగొడుతున్నాయి. కేరళ అవతల కూడా మలయాళ సినిమాలకు మంచి స్పందన వస్తోంది. ఇక మలయాళ చిత్రాలు ఓటీటీలో రిలీజైతే రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంటోంది.

కొవిడ్ టైంలో మలయాళ చిత్రాలకు బాగా అలవాటు పడ్డ ఇతర భాషా ప్రేక్షకులు.. అక్కడ మంచి సినిమాలను వెతుక్కుని, వెయిట్ చేసి మరీ ఆ చిత్రాలను ఓటీటీలో చూస్తున్నారు. పర భాషా ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్ కూడా చక్కగా చేసి పెడుతున్నారు వాటి మేకర్స్.

మలయాళ ఫిలిం మేకర్స్ మన సినిమాల మాదిరి గిమ్మిక్కులు చేయకుండా.. పరిమిత బడ్జెట్లో, తక్కువ వర్కింగ్ డేస్‌లో సినిమాలు పూర్తి చేస్తారు. కథను నమ్మి, వైవిధ్యమైన ఐడియాలతో ప్రేక్షకులకు కొత్తదనం పంచాలని చూస్తారు. సహజమైన వాతావరణంలోనే ఎక్కువగా సినమాలు తీయడం ఇంకో పెద్ద ప్లస్. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇతర భాషల ఆడియన్స్ కూడా వాటిని మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో సైతం మలయాళ సినిమాలను నేరుగా థియేటర్లకు వెళ్లి చూసే జనం పెరుగుతున్నారు. కాబట్టి మలయాళంలో తక్కువ బడ్జెట్లో తెరకెక్కే సినిమాలు కొన్ని రెట్ల వసూళ్లు రాబడుతున్నాయి. ఓటీటీలో అయితే ప్రతి మలయాళం హిట్ సినిమా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. అందుకే వాటికి ఓటీటీ సంస్థలు కూడా మంచి రేట్లు ఇస్తున్నాయి.

This post was last modified on April 19, 2026 7:59 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

1 hour ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

5 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

9 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

9 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

10 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

11 hours ago