సినిమా వాళ్లకేంటండీ బాబూ.. కోట్లల్లో పారితోషకాలు, రాజభోగాలు అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ వైభవం కొంతమందికే పరిమితం. ఇక్కడ మెజారిటీ జనాల పరిస్థితి దయనీయం. నిరంతరం అనిశ్చితితో బతికే సినీ ఆర్టిస్టులు, కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
లాక్ డౌన్ వల్ల ఇలాంటి వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో చెబుతూ బెంగాలీ టీవీ ఆర్టిస్టు సులఘ్న ఛటర్జీ ఒక వీడియోను రూపొందించింది. అది చూస్తే సినిమా వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఆమె ఈ వీడియోలో ఏమీ మాట్లాడకుండా కేవలం ప్లకార్డుల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్ల కష్టాల గురించి హృద్యంగా చెప్పింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.
‘‘నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తా. ప్రభుత్వానికి అత్యధిక పన్ను చెల్లించే రంగాల్లో ఇదొకటి. లాక్ డౌన్ టైంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నది మేమే. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెగ్యులర్‌గా పని ఉండదు. సమయానికి చెల్లింపులూ ఉండవు. చేతికి పని దొరికితే నోటికి తిండి.. మాలో చాలామంది పరిస్థితి ఇదే. మాకందరికీ 2 నెలలుగా పని లేదు. ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయం నుంచే పని దొరకట్లేదు. అన్ని ఆఫీసులూ మూతబడి ఉండటంతో పాత బకాయిలు చెల్లించలేదు.
మేం ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ నగరాల్లో ఉండాలి. మా లైఫ్ స్టైల్ కూడా రిచ్‌గా ఉండక తప్పని పరిస్థితి. మమ్మల్ని వలస కార్మికులుగా పరిగణించరు కాబట్టి మా స్వస్థలాలకు వెళ్లలేం. లాక్ డౌన్ ముగిసినా కొన్ని నెలల పాటు మాకు పనులు దొరకవు. రెగ్యులర్ ఖర్చులతో పాటు అప్పులు కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. మాకు ఫిక్స్డ్ శాలరీ ఉండదు. పీఎఫ్, గ్యాట్యుటీ లాంటివేమీ ఉండవు. ఒక్కో ప్రాజెక్ట్ మేర పని చేస్తాం. క్రమం తప్పకుండా పని ఉండదు. సమయానికి చెల్లింపులూ ఉండవు. ఏ విపత్తు వచ్చినా మేం అండగా నిలిచే ప్రయత్నం చేస్తాం. కానీ మాకు కష్టం వస్తే ఎవ్వరూ అండగా నిలవరు. మా బాధల గురించి ఎవరూ మాట్లాడరు, పట్టించుకోరు’’ అంటూ సినీ జనాల కష్టాల్ని చెప్పుకొచ్చింది సులఘ్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on May 5, 2020 12:12 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…