Movie News

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. మహేష్ బాబు చేత ఆన్ లైన్ వేదికగా రిలీజ్ చేయించారు. విచిత్రంగా దీని గురించి సోషల్ మీడియాలో పెద్గగా చర్చ జరగడం లేదు. రమేష్ బాబు కాలం చేశాక నటుడిగా ఆయన చేరుకోలేని ఎత్తులని కొడుకు అందుకుంటాడనే నమ్మకంతో కుర్రాడికి బాగా శిక్షణ ఇచ్చి ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి చేతిలో పెట్టారు.

నిన్నటి తరం హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తదానికి ఇదే తొలి తెలుగు సినిమా. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇన్ని అట్రాక్షన్లు ఉన్నప్పటికీ టీజర్ ఎందుకు హైలైట్ కావడం లేదనేది మూవీ లవర్స్ లో మెదులుతున్న ప్రశ్న. జయకృష్ణ లుక్స్ పరంగా పాసయ్యేలానే ఉన్నాడు. యాక్టింగ్ గురించి ఒక రెండు నిముషాలు చూసి కామెంట్ చేయలేం కానీ ట్రైలర్ వచ్చాక దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం.

జయకృష్ణని మహేష్ అభిమానులు ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేదు. గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ వచ్చేయడంతో వాళ్ళ దృష్టి వారణాసి మీదే ఉంది. పైగా తమ హీరో వారసుడిగా గౌతమ్ కి తొలి ప్రాధాన్యం ఇస్తారు తప్పించి జయకృష్ణకు ఆ అడ్వాంటేజ్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ ఫ్యాన్స్ దృష్టిలో ఎందుకు ఒకేలా ట్రీట్ చేయబడరో ఇదీ అంతే. అయితే జయకృష్ణ విషయంలో మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మాట వాస్తవం.

ఆల్రెడీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు చాలా సినిమాలు చేశాడు కానీ ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. గత రెండేళ్లలో వచ్చినవి మరీ అన్యాయంగా ఫ్లాప్ అయ్యాయి. మహేష్ బాబు కాకుండా ఇంకెవరూ మేజర్ కాంట్రిబ్యూషన్ చేయడం లేదు. గౌతమ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోగా జయకృష్ణ సెటిలైతే నిర్మాతలకు ఇంకో హీరో దొరికినట్టు అవుతాడు. అన్నట్టు శ్రీనివాస మంగాపురంకు ఈవెంట్, ప్రెస్ మీట్ లాంటివి ఎందుకు చేయలేదో.

This post was last modified on April 17, 2026 10:33 am

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

2 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago