బిగ్ బాస్‌తో పాటు అనేక టీవీ షోల ద్వారా పాపురల్ అయిన అమ్మాయి.. విష్ణుప్రియ భీమనేని. ఈ పాపులారిటీతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమె.. తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోరుకునే కుర్రాళ్ల కోసం కొన్నాళ్ల ముందు సబ్‌స్క్రిప్షన్లు కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు అమ్మాయిలు కుర్రకారును ఎంటర్టైన్ చేసేలా హాట్ కంటెంట్ ఇస్తూ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా లక్షలు ఆర్జించడం ట్రెండుగా మారింది.
విష్ణు ప్రియ సైతం ఇదే బాటలో సాగుతోంది. ఐతే విష్ణు ప్రియ టీవీ సెలబ్రెటీ కావడంతో ఆమె పేరు చర్చనీయాంశంగా మారింది. కుర్రాళ్ల బలహీనతను సొమ్ము చేసుకుంటోందంటూ ఆమె మీద ఒక వ్యక్తి కేసు పెట్టడం.. తన అకౌంట్ బ్లాక్ చేయించాలని కోరడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసు విషయమై పోలీసులు.. విష్ణు ప్రియను పిలిచి విచారించారు కూడా. ఈ సందర్భంగా మీడియా వాళ్లు ఆమె వెంట పడి అభ్యంతరకర ప్రశ్నలు అడగడం వివాదాస్పదమైంది.
విష్ణు ప్రియ చేస్తున్న దాంట్లో చట్టపరంగా ఏం తప్పు ఉందని కొందరు ప్రశ్నిస్తుంటే.. అందులో నైతికత గురించి మరికొందరు మాట్లాడుతున్నారు. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటున్న వాళ్లకు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఏంటి అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చ ఇలా సాగుతుండగా.. విష్ణు ప్రియ సబ్‌స్క్రైబర్లు అమాంతం పెరిగిపోతుండడం గమనార్హం.
ఆమె మీద కేసు పెట్టడానికి ముందు సబ్‌స్క్రైబర్లు 2 వేల లోపే ఉన్నారు. కానీ గత కొన్ని రోజుల్లో ఆమె పేరు మీడియాలో, సోషల్ మీడియాలో బాగా నానాక సబ్‌స్క్రైబర్ల సంఖ్య 5 వేలకు దగ్గరైంది. ఈ కేసు వివాదం మొదలయ్యాక కొన్ని రోజుల వ్యవధలోనే విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్లు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడం విశేషం.
సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.399 కాగా.. ఈ లెక్కన ఆమె నెలకు 18-19 లక్షల దాకా సంపాదంచే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు వల్ల అన్ పాపులర్ అయ్యానని విష్ణుప్రియ బాధ పడాలో.. లేక తన పాపులారిటీ పెరిగి ఆదాయం రెట్టింపు కన్నా ఎక్కువ అయినందుకు సంతోషించాలో తెలియని స్థితిలో ఉందేమో.
This post was last modified on April 14, 2026 11:58 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…