Movie News

జాన్వీని ఎందుకు దాచి పెడుతున్నారు

ఇప్పటిదాకా జరిగిన పెద్ది ప్రమోషన్లను జాగ్రత్తగా గమనిస్తే జాన్వీ కపూర్ కేవలం చికిరి చికిరి పాటలో మాత్రమే కనిపించింది. దాంట్లో కూడా రామ్ చరణ్ బ్యాట్ డాన్స్ హైలైట్ కావడంతో జూనియర్ శ్రీదేవి ఎక్కువ నోటీస్ కాలేదు. తర్వాత వదిలిన ‘రైరై రారా’ హీరో సోలో సాంగ్ కాబట్టి తనను ఆశించడానికి లేదు. నెక్స్ట్ అందరూ వేరే హీరోయిన్ డాన్స్ చేయబోయే ఐటెం సాంగ్ గురించి మాట్లాడుతున్నారు కానీ చరణ్, జాన్వీ మధ్య డ్యూయెట్ లాంటిది ఏదైనా ఉందో కూపీ లాగడం లేదు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం పెద్దిలో జాన్వీ, చరణ్ మధ్య ఒక మెలోడీ సాంగ్ ఉంది తప్పించి పోటాపోటీగా డాన్స్ చేసే నెంబర్ లేదట. కథకు అనుగుణంగా దర్శకుడు బుచ్చిబాబు ఇద్దరి మధ్య కెమిస్ట్రీని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. జాన్వీ పాత్రకు సంబంధించిన ట్విస్టు ఊహించని విధంగా ఉంటుందని, రెగ్యులర్ ప్యాట్రన్ లో కాకుండా ఊహించని మలుపు పెట్టారని అంటున్నారు. అదేంటో సెకండాఫ్ లో బయట పడుతుందని వినికిడి.

దీని సంగతలా ఉంచితే పెద్ది విడుదల తేదీ జూన్ 4 దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. టాక్సిక్ వచ్చే అవకాశాలు తగ్గిపోవడంతో ఆ స్లాట్ వాడుకునే ఆలోచనలో నిర్మాతలున్నారు. జాన్వీ మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉంది. సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఎలాంటి అప్డేట్స్ లేవు. అల్లు అర్జున్ రాకాలో తనున్న మాట నిజమే కానీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కేవలం దీపికా పదుకునే మాత్రమే అధికారికంగా అనౌన్స్ చేయబడింది.

దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ లో చాలా ఆఫర్లు వచ్చిన జాన్వీ ఒప్పుకున్నది పెద్ది ఒక్కటే. అటుపై రాకా. హిందీలో చూస్తేనేమో జాన్వీకి సక్సెస్ అందని ద్రాక్షగా మారిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే చేసింది కానీ అవార్డులు, కలెక్షన్లు రెండూ తక్కువే వచ్చాయి. ఒకవేళ పెద్ది, రాకాలు కనక రికార్డులు బద్దలు కొడితే హ్యాపీగా హైదరాబాద్ లోనే సెటిలవ్వొచ్చు. కాకపోతే తండ్రి బోనీ కపూర్ కు మాత్రం కూతురు బాలీవుడ్ స్టార్ కావాలని ఆశ.

This post was last modified on April 14, 2026 9:35 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

12 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago