సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ అమాంతం ఆకాశంలో ధరలు పలుకుతాయి. కానీ గత రెండేళ్లుగా అనిరుధ్ తన మేజిక్ మిస్ అవుతున్న ఫీలింగ్ మ్యూజిక్ లవర్స్ లో కలుగుతోంది. ఆయా చిత్రాల కమర్షియల్ ఫలితాలతో తనకు సంబంధం లేకపోయినా కనీసం ఆల్బమ్ వరకు మంచి పాటలు ఇచ్చి ఉంటే సంగీత ప్రియులు ఎంజాయ్ చేసేవాళ్లనేది వాస్తవం..
తాజాగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ డిజాస్టర్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే అనిరుధ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి తప్ప దీనికి సాంగ్స్ ఇచ్చింది తనేననే విషయం సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. దీనికన్నా ముందు వచ్చిన శివ కార్తికేయన్ ‘మదరాసి’ పరిస్థితి కూడా ఇంతే. ‘కూలీ’లో మోనికా మోనికా పాట తప్ప మిగిలినదంతా నీరసం తెప్పించిన స్కోరే. కింగ్డమ్, విదాముయార్చి, వెట్టయన్, ఇండియన్ 2 అన్నింటిది ఇదే పరిస్థితి. ‘దేవర’ ఒక్కటే తన రేంజ్ ఆల్బమ్ అని చెప్పాలి.
వీలైనంత త్వరగా అనిరుధ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. చేతిలో ఇంకా బోలెడు సినిమాలున్నాయి. ‘జన నాయకుడు’ పాటలు సోసోగానే అనిపించాయి. ‘జైలర్ 2’కి అదరగొట్టే రేంజ్ లో వర్క్ చేయాలి. నాని ‘ప్యారడైజ్’లో ఆయా షేర్ తరహాలో అన్ని పాటలు ఉంటే కనక మరోసారి సోషల్ మీడియాని ఊపేయొచ్చు. షారుఖ్ ఖాన్ ‘కింగ్’తో పాటు కమల్ – రజని మల్టీస్టారర్ కూడా అనిరుధ్ ఖాతాలోనే ఉన్నాయి. అల్లు అర్జున్ 23 తనకే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒకపక్క సాయి అభ్యంక్కర్ దూసుకుపోతున్నాడు. అనిరుధ్ ప్రత్యాన్మయంగా ఆల్రెడీ తనను నిర్మాతలు భావించడం మొదలైపోయింది. సో అనిరుధ్ సాలిడ్ గా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఏఆర్ రెహమాన్ పెద్దికి కొట్టి తన సత్తా మళ్ళీ చాటినట్టు తన బలమేంటో బక్కోడు (ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు) మళ్ళీ ప్రపంచానికి చూపించాలి. అరడజను సినిమాల్లో కనీసం మూడు వర్కౌట్ అయినా చాలు నిర్మాతల క్యూ అలాగే కొనసాగుతుంది.
This post was last modified on April 14, 2026 12:22 pm
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…