తెలుగు సినీ రంగంలో మరే దర్శకుడూ అందుకోని స్థాయికి చేరుకున్న వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణ రావు. గొప్ప సినిమాలు చాలామంది తీస్తారు. తిరుగులేని విజయాలూ అందుకుంటారు. కానీ మరణానంతరం తాము తీసిన సినిమాల ద్వారానే కాక.. వ్యక్తిగా కూడా జనాల గుండెల్లో నిలిచిపోయే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన కోవకు చెందిన వారే దాసరి నారాయణరావు.
సినిమాలు తగ్గించేశాక పరిశ్రమ పెద్దగా ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పరిశ్రమలో ఎవరికే కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన ముందు నిలబడేవారు. ఏ సమస్య తలెత్తినా.. పెద్ద మనిషిలా వ్యవహరించి పరిష్కరించేవారు. ఎప్పుడూ పరిశ్రమకు మంచి జరిగే విషయాల మీదే ఆయన దృష్టి ఉండేది. ఒక వ్యక్తి మరణానంతరం.. ‘ఆయన లేకపోవడం పెద్ద లోటు’ అని అంటుంటారు. ఈ మాట నూటికి నూరు శాతం నిజం అనిపించింది దాసరి విషయంలోనే.
దాసరి వెళ్లిపోగానే టాలీవుడ్లో ఒక శూన్యత ఏర్పడింది. ఆయన లేని లోటు చాలా కాలం వెంటాడింది. మెగాస్టార్ చిరంజీవి కొంత మేర ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాసరి మీద చిరుకు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సోమవారం దాసరి జయంతి సందర్భంగా ఆయన మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు చిరు.
దా.. స..రి అనే అక్షరాలకు ఆయన ఇచ్చిన అబ్రివేషన్ చాలా ప్రత్యేకమైందే. ‘‘(దా)నంలో కర్ణుడు మీరు.. (స)మర్థతలో అర్జునుడు మీరు.. (రి)పువర్గమే లేని ధర్మరాజు మీరు.. మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. ప్రతి భావి దర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది’’ అంటూ దాసరితో కలిసి చివరగా పాల్గొన్న ప్రెస్ మీట్ తాలూకు ఫొటోను పంచుకుని తన గురువుకు నివాళి అర్పించాడు చిరు. పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఈ రోజు దాసరిని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.
This post was last modified on May 4, 2020 3:39 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…