Movie News

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా వేసింది. ది ఫ్యామిలీ స్టార్ కూడా సక్సెస్ అయ్యి ఉంటే లెక్క వేరేలా ఉండేది కానీ తృటిలో హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తాజాగా విడుదలైన డెకాయిట్ కమర్షియల్ స్టామినా ఏంటనేది ఇంకా బయట పడలేదు కానీ నటన పరంగా మృణాల్ మరోసారి మంచి మార్కులు సంపాదించుకుంది. అడివి శేష్ కు ధీటుగా నటించింది.

ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో గెస్టుగా వచ్చిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మృణాల్ ని ఏకంగా స్మితా పాటిల్, మధుబాల లాంటి లెజెండరీ నటీమణులతో పోల్చేశారు. ఏది బడితే అది చేయొద్దని, నీకో లెగసి సృష్టించే ఛాన్స్ ఉందని అర్థం వచ్చేలా పొగడ్తల వర్షం కురిపించారు. అల్లు అరవింద్ సైతం ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. కథల ఎంపికలో ఆమె ఎంత సెలెక్టివ్ గా ఉంటుందో శేష్ ఉదాహరణతో సహా చెప్పేసరికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

నిజంగా మృణాల్ ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు ఏ మాత్రం తన స్థాయికి తూగేలా లేవు కదా బి గ్రేడ్ స్టఫ్ లా అనిపిస్తున్నాయి. అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2 కన్నా ఉదాహరణ అక్కర్లేదు. మొన్న వచ్చిన దో దివానే షెహర్ మేని ఆడియన్స్ అస్సలు పట్టించుకోలేదు. వీటికన్నా ముందు పిప్పా, ఆంఖ్ మిచోళి, గుమ్రాహ్ అన్నీ సూపర్ ఫ్లాపులే. సెల్ఫీలో ఐటెం సాంగ్ చేస్తే అదీ తుస్సుమంది.

తెలుగు నుంచి ఇన్ని ఆఫర్లు వస్తున్నప్పుడు ఇక్కడే సీరియస్ ఫోకస్ పెట్టడం చాలా అవసరం. కల్కిలో నాగ్ అశ్విన్ ఇచ్చింది చిన్న వేషమే కావొచ్చు కానీ పార్ట్ 2లో ( ఫ్లాష్ బ్యాక్ ) తనకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. అంత లేనిదే తన గురించి ఆయన గొప్పగా చెప్పడు కదా. డెకాయిట్ విడుదలకు ముందు ఎన్నో కథలు వింటూ ఆచితూచి అడుగులు వేస్తున్నానని చెప్పిన మృణాల్ హిందీలో మాత్రం ఈ నియమాన్ని పక్కన పెట్టేస్తోంది. అన్నట్టు అల్లు అర్జున రాకాలో తనున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 12, 2026 10:08 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago