టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినన్ని ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌బస్టర్లు మరే హీరో ఇవ్వలేదు అంటే అతిశయోక్తి కాదు. ఖైదీతో మొదలుపెడితే తర్వాతి రెండు మూడు దశాబ్దాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను రూల్ చేశాడు మెగాస్టార్. ఆయన కెరీర్లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అందులో ప్రస్తుత తరం హీరోలకు ఏవి సెట్ అవుతాయో చెబుతూ సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ కార్యక్రమంలో మెగాస్టార్ వెల్లడించిన అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తించాయి.
మీ కెరీర్లో మరపురాని సినిమాలను రీమేక్ చేస్తే ప్రస్తుత తరం హీరోల్లో దేనికి ఎవరైతే బాగుంటుందని సమంత అడిగితే చిరు సమాధానం ఇచ్చాడు. గ్యాంగ్ లీడర్ సినిమాకు తన కొడుకు రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగుంటాడని చిరు అభిప్రాయపడటం విశేషం.
ఇక ఇంద్ర సినిమాకు అయితే ప్రస్తుత కథానాయకుల్లో ప్రభాస్ పర్ఫెక్ట్ అని చిరు చెప్పాడు. సామాజిక అంశాలతో ముడిపడ్డ ఠాగూర్ సినిమాకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటాడని చిరు అన్నాడు. ఇక ఛాలెంజ్ సినిమాకు చిరు ఆసక్తికరమైన పేర్లు చెప్పాడు. అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాకు సరిపోతాడన్నాడు. తన సినిమాల్లో మాంచి ఎంటర్టైనర్ అయిన రౌడీ అల్లుడు సినిమాకు మాస్ రాజా రవితేజ పేరును చిరు సూచించడం విశేషం. ఆ సినిమాను బన్నీ చేసినా బాగుంటుందని అన్నాడు.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు తన కొడుకు రామ్ చరణ్ మాత్రమే కాక మహేష్ బాబు కూడా బాగుంటాడని అభిప్రాయపడ్డాడు. స్వయంకృషి సినిమాను రీమేక్ చేస్తే మాత్రం మళ్లీ తానే అందులో నటించాలని చిరు చెప్పడం విశేషం. విజేత సినిమాకు నాగచైతన్య పేరును చిరు సూచించాడు.
This post was last modified on December 27, 2020 10:11 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…