యువ నటుడు నవీన్ పొలిశెట్టి కెరీర్‌ను ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు ముందు, తర్వాత అని విభజించి చెప్పొచ్చు. ఆ సినిమా ముందు వరకు అతడి టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే లాంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసిన అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
ఐతే యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, స్పెషల్ వీడియాలతో అతను ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే చిచ్చోరేలో ఓ కీలక పాత్రతో మెప్పించాడు. రచ్చ గెలిచాక ఇంటికి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగు ప్రేక్షకులకు తన టాలెంట్ ఏంటో చూపించాడు. దీని తర్వాత నవీన్ నుంచి రాబోయే కొత్త సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో నవీన్ తన తర్వాతి సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే.. జాతి రత్నాలు. ఇందులో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ముగ్గురే ఇందులో జాతిరత్నాలు. అందులో ఒకరి పరిచయం శనివారం జరిగింది. ఈ రోజు నవీన్ పుట్టిన రోజు సందర్భంగా అతను పోషిస్తున్న జోగిపేట శ్రీకాంత్ పాత్రను పరిచయం చేశారు. ఆ పాత్ర టీజర్లో నవీన్ ఖైదీగా కనిపించడం విశేషం.
సెల్ నుంచిపోలీసుల అరాచకాలను ఖండిస్తూ తనదైన టైమింగ్‌తో అతను చెప్పిన డైలాగ్.. జైల్లో పని చేస్తూ అతను పడే పాట్లు ఫన్నీగా అనిపించాయి. మంచి కామెడీ ఎంటర్టైనర్ చూడబోతున్నామన్న అంచనాలను ఈ టీజర్ కలిగించింది. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు టీజర్లోనే ప్రకటించారు. అనుదీప్ కె.వి. ఈ చిత్రానికి దర్శకుడు.
This post was last modified on December 27, 2020 10:21 am
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…