తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సుదీర్ఘ విరామం తర్వాత కళ వచ్చింది. లాక్ డౌన్ వల్ల 8-9 నెలల పాటు మూత పడి ఉన్న థియేటర్లలో చాలా వరకు ఈ వారమే తెరుచుకున్నాయి. కొన్ని మల్టీప్లెక్సులు ముందే ఓపెన్ అయినప్పటికీ.. వాటిలో పెద్దగా సినిమాలు ఆడింది లేదు. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘టెనెట్’ ఒక వీకెండ్లో సందడి చేసింది కానీ.. ఆ తర్వాత అంతా ఖాళీయే. పున:ప్రారంభమైన థియేటర్లను కూడా మళ్లీ ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి.
ఇలాంటి సమయంలో థియేటర్ రంగంలో ఎన్నో ఆశలు రేపుతూ తెలుగు చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ వచ్చింది. డిసెంబరు 25న రిలీజ్ అనగానే బుకింగ్స్ ఆశించిన స్థాయిలో ఉంటాయా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అని చాలామంది సందేహించారు. కానీ రిలీజ్ దగ్గరపడేసరికి కథ మారిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాల్ని మించిపోయాయి. 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో అయినా సరే.. చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి.
‘సోలో బ్రతుకే సో బెటర్’కు మంచి టాక్ వస్తే సినిమా రేంజి మరోలా ఉండేది కానీ.. చూసిన వాళ్లందరూ ఈ చిత్రం ‘యావరేజ్’ అని అంటున్నారు. రివ్యూలు కూడా అలాగే వచ్చాయి. మళ్లీ థియేటర్లకు వెళ్లి టైంపాస్ చేయడానికి ఓకే అంటున్నారే తప్ప.. కచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే కాదన్నది మెజారిటీ మాట. ఐతే ఈ టాక్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సోలోగా రిలీజైన నేపథ్యంలో ఈ వీకెండ్ వరకు బాక్సాఫీస్‌ను ఏలడం ఖాయంగా కనిపిస్తోంది. శని, ఆదివారాలకు కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. హౌస్ ఫుల్స్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐతే అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్‌లోనూ ఈ సినిమానే ఆడిస్తున్న నేపథ్యంలో సినిమా చూడాలనుకున్నవాళ్లందరికీ టికెట్లు దొరకవన్న ఇబ్బంది లేదు. కాబట్టి వీకెండ్ అయ్యేలోపు జనాలు పెద్ద ఎత్తునే ఈ చిత్రాన్ని చూసే అవకాశముంది. ఆ తర్వాత సినిమా ఆడటం కష్టమే. ఐతే ఈ చిత్రాన్ని హోల్‌సేల్‌గా కొనేసిన జీ స్టూడియోస్ వాళ్లు.. కొంత విరామం తర్వాత దీన్ని తమ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది లేనట్లే.
This post was last modified on December 26, 2020 1:19 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…