మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా పెరగడం లేదనేది ట్రేడ్ లో వినిపిస్తున్న మాట. తండ్రి కొడుకుల ఎమోషన్ మీద నడిచిన బైకర్ కు కుటుంబ ప్రేక్షకుల మద్దతు చాలా అవసరం. కానీ ఆ స్థాయిలో వాళ్ళు ఇంకా టర్న్ కావడం లేదనేది వాస్తవం. వీకెండ్ అయిపోతే సోమవారం నుంచి డ్రాప్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఫస్ట్ సండే చాలా అంటే చాలా కీలకం కానుంది.
ముందుగా చెప్పాల్సింది క్రికెట్. ఐపీఎల్ ఫీవర్ జనంలో బాగా ఉంది. ఇవాళ మధ్యాన్నమే సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్ జనాలే కాదు తెలుగు క్రీడా ప్రియులు అధిక శాతం టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతారు. సో కీలకమైన సెలవు రోజు సగం ఇక్కడ ఖర్చయిపోతుంది. దీని వల్ల మధ్యాన్నం షోలు బాగా ఇంపాక్ట్ అవుతాయి. సాయంత్రం కూడా కీలకమైన గేమ్ ఉంది. ఇలా హాలిడే నాడు క్రికెట్ పెద్ద పీఠ వేస్తే థియేటర్ల కలెక్షన్లు ప్రభావితం చెందుతాయి.
ఇంకోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలకు మొదలైతే సాయంత్రం ఆరు దాకా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండటం లేదు. ఈ టైంలో అదే పనిగా జనాలు సినిమాల కోసం బయటికి వచ్చే శాతం తగ్గిపోతుంది. అలాని అస్సలు రారని కాదు. ఒకవేళ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే నడినెత్తిన సూర్యుడు ఉన్నా సరే సినిమాలకు వెళ్లేంత ప్రేమ తెలుగు ఆడియన్స్ ది. రాకాస, బైకర్ లకు వచ్చింది బాగానే ఉన్నాయనే మాట కానీ అదిరిపోయాయని కాదు.
ఈ ప్రభావం ఇంకొన్ని వారాలు ఇలాగే కొనసాగనుంది. వచ్చే వారం డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రాబోతున్నాయి. అడివి శేష్, ప్రదీప్ రంగనాథన్ ఏం చేస్తారోనన్నీ బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ రేపటి నుంచి రాకాస, డెకాయిట్ ఆక్యుపెన్సీలు కనక డీసెంట్ గా ఉంటే థియేటర్లు ఆక్సీజెన్ పీల్చుకుంటాయి. పోటీలో వచ్చిన డబ్బింగ్ బ్యాచ్ కార్మేని సెల్వం, లీడర్ ఊసులో లేకుండా వెళ్లపోయాయి. అవి వచ్చిన సంగతే జనాలకు రిజిస్టర్ కాలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates