Movie News

వీరభద్రుడా… మంచి పని చేశావ్ !

తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు గుర్తించలేకపోతున్నారు. తంగలాన్, వలిమై, వెట్టయన్, మార్గన్, రాయన్, తలైవి అంటూ అక్షరం అర్థం కాకుండా పెడుతూ ఇక్కడ శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒకటో రెండో తప్ప ఇవన్నీ దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. సూర్య కరుప్పు కూడా ఇదే లిస్టులో చేరుతుందేమోనని అభిమానులు ఆందోళన పడ్డారు.

ఇంక ఆ టెన్షన్ అక్కర్లేదు. కరుప్పు తెలుగు వెర్షన్ కు వీరభద్రుడు టైటిల్ ఫిక్స్ చేసి మే 14 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో సూర్య డ్యూయల్ రోల్ చేశారు. చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ ఫ్యాన్స్ అసహనానికి కారణమవుతూ బయ్యర్లను కూడా ఎదురుచూపులోనే విసిగించేసింది. ఎట్టకేలకు దానికి మోక్షం కలిగిస్తూ ఇటీవలే రిలీజ్ నిర్ణయం తీసుకుని మంచి పని చేశారు.

వీరభద్రుడు మంచి మాస్ పేరు. గతంలో ఈ టైటిల్ తో మాదాల రంగారావు హీరోగా నాలుగు దశాబ్దాల క్రితం ఒక సినిమా వచ్చింది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి డెబ్యూ ఇది. తర్వాత బాలకృష్ణతో వీరభద్ర అనే మరో మూవీ వచ్చింది. యజ్ఞం ఫేమ్ రవికుమార్ చౌదరి దర్శకుడు. విచిత్రంగా ఈ రెండు డిజాస్టర్లు కావడం గమనించాల్సిన విషయం. మరి సూర్య దాన్ని బ్రేక్ చేసి సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. వీరభద్రుడుకి హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక ప్రమోషన్లు చేయబోతున్నారు.

ఈ సినిమా హిట్ కావడం సూర్యకు చాలా కీలకం. చాలా ఏళ్లుగా వరస ఫ్లాపులతో సతమతవుతున్న ఈ టాలెంటెడ్ హీరోకి కంగువా ఇచ్చిన చేదు ఫలితం బాగా హర్ట్ చేసింది. తర్వాత రెట్రో కూడా ఇదే దారి పట్టింది. వీరభద్రుడు కనక హిట్ అయితే తర్వాత వచ్చే విశ్వనాథ్ అండ్ సన్స్ కు ఉపయోగపడుతుంది. ఇది జూలైలో రానుంది. కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు సూర్య సినిమాలు విడుదలకు రెడీ కావడం మొదటిసారని చెన్నై టాక్. అందుకే 2026 తనకు స్పెషల్ గా నిలవనుంది.

This post was last modified on April 3, 2026 9:14 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

3 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago