Political News

రొటీన్ ‘లీడర్’తో ఏం సాధించారు

2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మల్టీలాంగ్వేజెస్ లో ఆయన తీయించిన మాస్టర్ పీస్ కి చాలా చోట్ల పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. నవ్వుకుందామనో, ట్రోలింగ్ మెటీరియల్ దొరుకుతుందేమోనని థియేటర్లకు కాసింత జనాలు వెళ్లారు కానీ ఆ మూవీ వల్ల నిర్మాత కూడా తానే అయిన శరవణన్ కు పైసా ప్రయోజనం దక్కలేదు.

దీంతో నటనకు స్వస్తి చెబుతారమోనని అందరూ అనుకున్నారు. కానీ నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ ఇచ్చి శరవణన్ కొత్త మూవీతో వచ్చారు. అదే లీడర్. తమిళంతో పాటు తెలుగులోనూ ఇది ఇవాళే రిలీజయ్యింది. బైకర్, రాకాస గోలలో ఇది వచ్చిందనే సంగతే చాలా మందికి తెలియదు. ప్రమోషన్లు లైట్ తీసుకోవడంతో మార్నింగ్ షోకే జనం లేక థియేటర్లు వెలవెలబోయాయి. దొరికిన కాసిన్ని స్క్రీన్లలోనూ కనీస ఆక్యుపెన్సీలు నమోదు చేయలేకపోయింది లీడర్.

సరే ఇంత గ్యాప్ వచ్చింది కదా లీడర్ లో కొత్తగా ఏమైనా ట్రై చేశారేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కూడా రొటీన్ బాపతే. కూతురితో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న హీరో శక్తివేల్ లైఫ్ లోకి కాలకేయ ప్రభాకర్ రూపంలో ఒక విలన్ ప్రవేశిస్తాడు. అప్పటిదాకా బాషా ఫస్టాఫ్ లో రజనీకాంత్ లాగా సైలెంట్ గా ఉన్న శక్తివేల్ కన్నబిడ్డను కాపాడుకోవడం కోసం తన అసలు విశ్వరూపాన్ని బయటికి తీస్తాడు. అక్కడి నుంచి  యాక్షన్ డ్రామా మొదలవుతుంది.

విచిత్రం ఏమిటంటే దీనికి కూడా పెద్ద బడ్జెట్ పెట్టారు. దర్శకుడు దొరై సెంథిల్ కుమార్ వీలైనంత వరకు మాస్ కి టైం పాస్ చేయించే ఎంటర్ టైనర్ ఇవ్వడానికి కష్టపడ్డాడు. జార్జియాలో చాలా రిస్కు తీసుకుని షూట్ చేసిన క్లైమాక్స్ ట్రైన్ ఫైట్ దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. శరవణన్ ని హీరో మెటీరియల్ గా భావించే వాళ్ళు లీడర్ ని ట్రై చేయొచ్చు కానీ మిగిలినవాళ్ళు మాత్రం ఏంటిది అనుకుంటున్నారు. బైకర్ కు మ్యూజిక్ ఇచ్చిన జిబ్రానే ఈ లీడర్ కి సంగీత దర్శకుడు.

This post was last modified on April 3, 2026 11:55 pm

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

50 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

5 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

8 hours ago