Movie News

థియేటర్లలో హర్షాతిరేకాలు


థియేటర్లను పునర్నిర్మించాల్సి వచ్చినపుడు.. కొత్తగా ఏదైనా సొబగులు అద్దాలనుకున్నపుడు ఆయా థియేటర్లను తాత్కాలికంగా కొంత కాలం మూసి ఉంచడం జరుగుతుంది తప్ప.. ఒకే సమయంలో మొత్తం అన్ని థియేటర్లనూ నెలల తరబడి మూసి వేసి సినిమాల ప్రదర్శన ఆపేయడం ఇంతకుముందెన్నడూ చూడనిది. వరదలు, సమ్మెలు జరిగినపుడు కూడా ఒకట్రెండు షోలు ఆపేసి మళ్లీ సినిమాలు నడిపిస్తుంటారు. అలాంటిది ఏకంగా తొమ్మిది నెలల పాటు థియేటర్లను మూసి ఉంచడం అన్నది ఊహకందని విషయం.

కరోనా పుణ్యమా అని ఈ వైపరీత్యం చోటు చేసుకుంది. కొన్ని వారాలు అనుకున్న లాక్ డౌన్‌ను నెలల తరబడి కొనసాగించి.. తర్వాత సడలింపులు ఇచ్చినా సరే థియటర్లను మినహాయిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఎట్టకేలకు అక్టోబరులో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులిచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు తెరుచుకోవడానికి చాలా సమయం పట్టేసింది. అవి పూర్తి స్థాయిలో మొదలైంది ఈ రోజు, అంటే డిసెంబరు 25న.

‘సోలో బ్రతుకే సో బెటర్’ లాంటి కాస్త పేరున్న కొత్త సినిమా విుడదల కావడంతో చాలా థియేటర్ల బూజు దులిపి ముస్తాబు చేశారు. మల్లీప్టెక్సులు ముందే తెరుచుకున్నప్పటికీ.. ఇప్పటిదాకా డల్లుగానే నడిచాయి. ఈ సినిమాతో మళ్లీ వాటికి కళ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్.. హౌస్ ఫుల్స్ లాంటి మాటలు సుదీర్ఘ విరామం తర్వాత వినిపించాయి. తొమ్మిది నెలలకు పైగా జీవం కోల్పోయిన తెరలకు మళ్లీ కళ వచ్చింది. థియేటర్లు తెరుచుకుంటే.. మంచి సినిమా వస్తే వెళ్లి సినిమా చూడాలని ఎప్పట్నుంచో అనుకుంటున్న ప్రేక్షకులు కూడా ఎట్టకేలకు కదిలారు.

ఇంతకాలం ఉపాధి, ఆదాయం కోల్పోయిన థియేటర్ కార్మికులు, యజమానులకు మళ్లీ ఉత్సాహం వచ్చింది. పార్కింగ్స్ ఫుల్ అయ్యాయి. హాళ్లు నిండాయి. క్యాంటీన్లలో సండిది నెలకొంది. ఇక థియేటర్ హాళ్ల లోపల వాతావరణం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ సహా చాలా థియేటర్లు ‘వెల్కమ్ బ్యాక్’ అంటూ ప్రేక్షకులతో తమ ఉద్వేగాన్ని పంచుకున్నాయి. ఇక సినిమా టైటిల్స్ పడేటపుడు అందరిలోనూ ఒక ఎగ్జైట్మెంట్ కనిపించింది. అది స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ఎంతోమంది షేర్ చేస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’కు టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ.. ఈ రోజుకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మాత్రం ఈ సినిమానే. అందుకే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.

This post was last modified on December 25, 2020 5:47 pm

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

53 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

8 hours ago