Movie News

బ్రో దర్శకుడి సినిమాకు చప్పుడు లేదు

ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన సంగతే సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. మనకు బాగా పరిచయమున్న నటుడు, పవన్ కళ్యాణ్ బ్రో దర్శకుడు సముతిరఖని హీరోగా రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు రామ్ చక్రి దర్శకత్వం వహించారు. దీని కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేశారు. ప్రెస్ మీట్లు నిర్వహించి కాస్తో కూస్తో సౌండ్ చేశారు.

కానీ కార్మేని సెల్వంని మన జనాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. బ్యాడ్ మూవీ కాదు కానీ ఇంత బరువైన భావోద్వేగాలు అది కూడా తమిళ ఆర్టిస్టులతో చూడాలంటే టాలీవుడ్ ఆడియన్స్ కు కొంచెం కష్టమే. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఒక కారు డ్రైవర్ డబ్బు, స్వంత ఇల్లు కోసం ఎలాంటి అగచాట్లు పడ్డాడు, చివరికి అతని ప్రయాణం చెన్నై నుంచి దుబాయ్ దాకా ఎలా జరిగింది అనేది ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు.

ఎంత సమర్ధించుకున్నా డబ్బింగ్ సినిమాల నిర్మాతలు తమిళ మలయాళ పేర్లను యధాతథంగా ఉంచి తప్పు చేస్తున్నారు. రజనీకాంత్ అంతటి సూపర్ స్టార్ మూవీకి వెట్టయన్ అని పెడితే మన జనాలు ఆదరించలేదు. అలాంటిది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన వాటికి కనీసం నేటివిటీ కోసమైనా పేర్లు మార్చాలన్న స్పృహ లేదు. కార్మేని సెల్వం బదులు కాచిగూడ సూరి అని పెట్టినా కనీసం కాసింత జనం కనిపించేవారు. కార్మేని సెల్వం పేరు దగ్గరే కనెక్టివిటీ పోయింది.

ఇకనైనా ఈ ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఎంత తెలుగు ప్రేక్షకులది పెద్ద మనసు అయినా మరీ ఇంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. పల్లి చట్టంబి విషయంలో కూడా టోవినో థామస్ ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆయన చెప్పిన బాహుబలి లాజిక్ ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేదు. బిసి సెంటర్లలో జనాలు రావాలంటే టైటిల్ ఎంత ముఖ్యమో ప్రొడ్యూసర్లు గుర్తించే వరకు ఇలాంటివి కనీస ఓపెనింగ్స్ కి కూడా నోచుకోలేవు.

This post was last modified on April 3, 2026 4:52 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago