వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కూటమి అధికారం చేపట్టిన తర్వాత పలు అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు సంధిస్తున్న నానిపై పలు కేసులు నమోదు అయినా… ఆయన అరెస్టు కాలేదు. అయితే తాజాగా నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోలీసు అధికారులపై బాడీ షేమింగ్ చేశారంటూ నానిపై ఈ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నాని అరెస్టు తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే… గురువారం మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. పట్టణంలోని ఆరో వార్డులో ఇళ్ల కూల్చివేతల వద్దకు వెళ్లిన నాని…అక్కడ మునిసిపల్ అధికారులతో పాటుగా పోలీసుల తీరుపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
పోలీసు అధికారి జైపాల్ పై నాని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపించాయి. ఈ ఘటనలో నాని తీరును నిరసించిన కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం నానిపై చిలకలపూడి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు ఆయనను అరెస్టు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… పోలీసులు తనపై కేసు నమోదు చేయడం, తన అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న పరిస్థితులను గమనించిన నాని… దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం మీడియా మీట్ ఏర్పాటు చేసిన నాని… గురువారం నాటి ఘటనలో తానేమీ తప్పు చేయలేదన్నారు. విపక్షానికి చెందిన నేతగా ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించడమే తన ఉద్యోగమని ఆయన అన్నారు. తనను జైలులో పెట్టినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా ఆయన అన్నారు. అయినా జైపాల్ పై తాను బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయలేదన్నారు.
తప్పు చేసే అధికారులు ఏ విభాగానికి చెందిన ఉద్యోగులైనా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని, నిలదీస్తూనే ఉంటానని నాని పేర్కొన్నారు. జైపాల్ తప్పు చేశారు కాబట్టే ఆయన తీరును ప్రశ్నించానన్నారు. తనను జైపాల్ ఏకవచనంతో దూషించలేదా? అని ఆయన ప్రశ్నించారు.
జిల్లాలో 4 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారని, వారిలో 3 వేల మంది నిజాయతీ కలిగిన అధికారులేనని…మిగిలిన వెయ్యి మంది జైపాల్ లాంటి వారేనని అన్నారు. అయినా నిన్నటి ఘటనలో తాను చేసింది తప్పే అయితే తనను ఏమైనా చేసుకోవచ్చని, అరెస్టు చేసినా భయపడబోనని నాని అన్నారు. ఈ సందర్భంగా జైపాల్ కు నమస్కరిస్తున్నానని చెప్పిన నాని… తనది తప్పే అయితే జైపాల్ తనను ఏమైనా చేసుకోవచ్చంటూ నాని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on April 3, 2026 3:17 pm
ఒకప్పుడు చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలతో స్థిరపడటం.. ఇవే జీవితంలో…
తెలంగాణలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మధ్యతరగతిప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
అనంతపురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ…
నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ…
గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే కేవలం వినియోగదారుడి ఇంటికి దానిని చేర్చడం మాత్రమే కాదు. సిలిండర్ భద్రత, గ్యాస్ లీకేజీని…
కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న వార్త నిజమే అని తేలింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన మెగా…