Political News

సీఎం కుర్చీపై అనిరుధ్ రెడ్డి కన్ను

ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో అయితే గల్లీ లీడర్ కూడా సీఎం పోస్టుకు అర్హుడే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నా.. ఆ పోస్టుపై లెక్కలేనంత మంది గురి పెడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే…టాప్ పోస్టులను ఆశిస్తూ సాగే నేతల సంఖ్య చాంతాడంత ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా చేరిపోయారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు.

ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని చెప్పిన అనిరుధ్… ఆ తర్వాత ఆ పోస్టు కోసం ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ముందుకు వచ్చే నేతల్లో తాను కూడా ఉన్నానని, అలా భావించడంలో తప్పేం లేదు కదా అని కూడా ఆయన ప్రశ్నించారు. మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచాక తాను సీఎం అభ్యర్థినే అని ఆయన తనదైన శైలి వ్యాఖ్య చేశారు. 

జడ్చర్ల నుంచి 2023లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిరుధ్ పలుమార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రేవంత్ సర్కారుపై అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారంటూ గతంలో అనిరుధ్ పై వార్తలు వినిపించాయి. ఇక ఓ మంత్రిని టార్గెట్ చేసిన అనిరుధ్…ఆ మంత్రి తమ నియోజకవర్గాల్లోనూ వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారంటూ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన తమకూ సీఎం అపాయింట్ మెంట్లు ఇస్తూ ఉండాలని కూడా అనిరుధ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

ఇక అనిరుధ్ తాజా ఇంటర్వ్యూ విషయానికి వస్తే… సీఎం రేసులో మీరూ ఉన్నారా? అన్న ప్రశ్నకు ఆయన ఉన్నానని చెప్పారు. రేవంత్ మరోసారి సీఎంగా కొనసాగినా… ఆ తర్వాత అయినా వేరే ఎవరో ఒకరు ఆ పదవిలోకి రావాల్సిందే కదా అంటూ ఆయన చెప్పారు. అందుకే తనను మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని జడ్చర్ల ప్రజలను ఇప్పటికే కోరానని తెలిపారు. ఈ లెక్కన మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే సీఎం రేసులో ఉన్నట్టేనా? అన్న ప్రశ్నకు.. ”హండ్రెడ్ పర్సంట్ నేను సీఎం రేసులో ఉన్నట్టే” అని ఆయన తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టేశారు.

This post was last modified on April 3, 2026 4:55 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago