ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న తన 22వ సినిమా AA22 నుంచి ఏదైనా ఒక అదిరిపోయే వీడియో అప్డేట్ వస్తుందని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఫ్యాన్స్ ఆశించిన గ్లింప్స్ లేదా టీజర్ ఈసారి రావడం లేదని తెలుస్తోంది. దీనికి బదులుగా కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే మేకర్స్ సరిపెట్టే అవకాశం ఉంది.
సాధారణంగా ఇంత పెద్ద ప్రాజెక్టుల విషయంలో గ్లింప్స్ రాకపోవడం అనేది అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. కానీ ఇక్కడ దర్శకుడు అట్లీ ఒక పక్కా ప్లాన్‌తోనే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం పుట్టినరోజు కదా అని ఏదో ఒక వీడియోను హడావిడిగా వదలడం కంటే, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండటమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రిస్క్ తీసుకోకుండా కేవలం ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌తోనే సినిమాపై ఉన్న క్రేజ్‌ను మెయింటైన్ చేయాలని టీమ్ డిసైడ్ అయ్యింది.
అసలు విషయానికి వస్తే, ఈ అప్డేట్ ఆగిపోవడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ అని తెలుస్తోంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతో గ్రాఫిక్స్ పనితనం చాలా కీలకం. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో విజువల్ అవుట్‌పుట్ రాకపోవడంతో, అరకొర విజువల్స్‌తో టీజర్‌ను రిలీజ్ చేయడం కంటే దాన్ని పక్కన పెట్టడమే ఉత్తమమని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఏదో ఒక వీడియోను రిలీజ్ చేసి ఆ తర్వాత నెగిటివ్ బజ్ తెచ్చుకోవడం కంటే, పర్ఫెక్ట్ టైమ్ కోసం వెయిట్ చేయడం మంచి స్ట్రాటజీ అని చెప్పొచ్చు.
ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలకు సోషల్ మీడియాలో మొదట్లో చిన్న నెగిటివ్ టాక్ వచ్చినా అది సినిమా ఫలితంపై గట్టి ప్రభావం చూపుతోంది. ఒకసారి నెగిటివ్ ఇంప్రెషన్ పడితే దాన్ని మళ్ళీ పాజిటివ్ గా మార్చుకోవడానికి చిత్ర బృందం చాలా కష్టపడాల్సి వస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో, మొదటి అడుగులోనే ఎలాంటి తప్పులు జరగకూడదని అట్లీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు అది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇక మేకర్స్ ఇవ్వబోయే అప్డేట్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on April 3, 2026 11:56 am
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…