Movie News

15 కోట్లు తీసుకునే హీరోకు 50 కోట్లు ఇస్తే?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ సంస్థలు పొరుగు ఇండస్ట్రీలపై గట్టిగానే దృష్టి పెట్టాయి. ముఖ్యంగా తమిళ సినీ రంగంలో పట్టు సాధించడానికి తెలుగు నిర్మాతలు భారీ వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఒక అగ్ర హీరోతో సినిమా చేసి సక్సెస్ అయిన ఒక ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ, ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు ఆఫర్ చేస్తున్న పారితోషికాలు ఇప్పుడు చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సాధారణంగా ఒక హీరో మార్కెట్ వాల్యూని బట్టి రెమ్యునరేషన్ ఉండటం సహజం. కానీ సదరు తెలుగు సంస్థ మాత్రం తెలుగు మార్కెట్ ను కూడా దృష్టిలో ఉంచుకుని అక్కడి హీరోలకు భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ఆ హీరోల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. అంతకుముందు వరకు ఒక రేంజ్ లో పారితోషికం తీసుకున్న వారు, ఇప్పుడు తెలుగు సంస్థలు ఇస్తున్న ఆఫర్లను చూపిస్తూ లోకల్ ప్రొడ్యూసర్ల దగ్గర కూడా అదే స్థాయిలో డిమాండ్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇది అక్కడి స్థానిక నిర్మాణ సంస్థలకు కొంత ఇబ్బందిగా మారిందని టాక్.

ఆ యంగ్ సెన్సేషన్ హీరోకు తెలుగు సంస్థ ఒక భారీ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడితోనే రాబోతున్న ఈ సినిమా కోసం అతనికి ఏకంగా 50 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతకుముందు వరకు అతని రెమ్యునరేషన్ 15 కోట్ల లోపే ఉండేదని, ఇప్పుడు తెలుగు సంస్థ ఎంట్రీతో అది ఒక్కసారిగా డబుల్ అయ్యిందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భారీ ఆఫర్ తో మిగతా లోకల్ ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారట.

తెలుగులో ఇప్పటికే అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ భారీ రెమ్యునరేషన్లు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఈ సంస్థకు ఉంది. వారి బ్యానర్ లో సినిమా అంటేనే భారీ పారితోషికం పక్కా అనే అభిప్రాయం అందరిలోనూ బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు అదే ఫార్ములాను తమిళంలో కూడా అప్లై చేస్తూ అక్కడి హీరోలను ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పరిణామం తమిళ ఇండస్ట్రీలోని లోకల్ ప్రొడ్యూసర్లకు మింగుడు పడటం లేదని, దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ అనవసరంగా పెరిగిపోతోందని వారు భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, తమిళ ఇండస్ట్రీలో తెలుగు వారికి సపోర్ట్ అంతంత మాత్రంగానే ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ ఈ తెలుగు సంస్థ మాత్రం అక్కడి డిస్ట్రిబ్యూటర్లతో నేరుగా డీల్స్ కుదుర్చుకుంటూ తన పట్టును పెంచుకుంటోంది. కేవలం సినిమా తీయడమే కాకుండా, దాన్ని రిలీజ్ చేసే విషయంలో కూడా పక్కా ప్లాన్ తో వెళుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ తెలుగు సంస్థ వేస్తున్న స్కెచ్ తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

This post was last modified on April 3, 2026 2:32 pm

Share

Recent Posts

బంధాలు వద్దు.. బాధ్యతలు వద్దు.. జెన్ జీ కొత్త జీవన మంత్రం..

ఒకప్పుడు చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలతో స్థిరపడటం.. ఇవే జీవితంలో…

6 hours ago

ఆర్-ఆర్ ట్యాక్స్ ఇంత‌లా వ‌సూలు చేస్తున్నారా?!

తెలంగాణ‌లో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తిప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

7 hours ago

‘ఒరే.. మేం బానే ఉంటాం.. మీరెందుకురా గొడ‌వ ప‌డేది’

అనంత‌పురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, టీడీపీ…

8 hours ago

భోగి మంటలకు మంచి అవకాశం

నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ…

8 hours ago

గ్యాస్ సిలిండర్‌కు మంటలు వస్తే ఇలాగా చేసేది?

గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే కేవలం వినియోగదారుడి ఇంటికి దానిని చేర్చడం మాత్రమే కాదు. సిలిండర్ భద్రత, గ్యాస్ లీకేజీని…

9 hours ago

మెగా హీరో ఇక సింగిల్ కాదు

కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న వార్త నిజమే అని తేలింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన మెగా…

9 hours ago