Movie News

చరణ్ బన్నీ ఇద్దరూ షాకులిస్తున్నారు

సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్ విపరీతమైన డిస్కషన్ కు నోచుకుంటున్నాయి. వాటిలో మొదటిది పెద్ది పోస్ట్ పోన్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచమంతా కోడై కూస్తున్నా నిర్మాణ సంస్థ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉండటంతో అభిమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది. అయితే కొత్త డేట్ నిర్ణయించడం అనేది హఠాత్తుగా తీసుకునేది కాదు. దాని వెనుక ఎన్నో క్యాలికులేషన్లు చేసుకోవాలి. రెండు తేదీలు మారాయి కాబట్టి ఈసారి తొందరపడే ఛాన్స్ ఎంత మాత్రం లేదు.

సో అభిమానుల ఆశ నిరాశల సంగతి ఎలా ఉన్నా పెద్ది మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. ఇతర నిర్మాతలు ఇప్పుడు ఆఘమేఘాల మీద తమ సినిమాలను అదే డేట్ కి వదిలే సాధ్యాసాద్యాల గురించి ఎనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా వీడియో కంటెంట్ వస్తుందేమోనని బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే టైటిల్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ తప్ప ఇంకెలాంటి అప్డేట్ ఉండకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.

అదే జరిగితే ఇది కూడా కొంచెం అసంతృప్తి కలిగించేదే అవుతుంది. దీని గురించి ఎక్కువ హైలైట్ కాకూడనేమో కాబోలు రేసు గుర్రం రీ రిలీజ్ గురించి ఎక్స్, ఇన్స్ టాలో తెగ హడావిడి చేస్తున్నారు. బన్నీ పుట్టినరోజు కానుకని ఘనంగా దాంతో థియేటర్లలో సెలెబ్రేట్ చేసుకుందామని పిలుపు ఇస్తున్నారు. మొన్న మగధీర స్పెషల్ షోలలో పెద్ది పాటలు, టీజర్లు ఎంజాయ్ చేసినట్టు బన్నీ అభిమానులు రేసు గుర్రంలో ఏఏ 22 వీడియోని ఆస్వాదించే అవకాశం రాకపోవచ్చు.

షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉండటంతో టీజర్ విషయంలో దర్శకుడు అట్లీ హడావిడి పడదలుచుకోలేదట. ఐకాన్ స్టార్ కూడా దానికి మద్దతు ఇవ్వడంతో టీజర్ ప్లాన్ డ్రాప్ అయ్యారని అంటున్నారు. వచ్చే ఏడాది ఎప్పుడు సినిమాని రిలీజ్ చేయాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల విషయంలో తొందరపాటు వద్దనేది టీమ్ నిర్ణయంగా కనిపిస్తోంది. చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2తో పాటు ఏఏ 22 టీజర్ ని గ్రాండ్ గా లాంచ్  చేసే ఆలోచనలో సన్ పిక్చర్స్ ఉందట.

This post was last modified on March 30, 2026 8:15 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago