Movie News

ఆదిపురుష్ గాయాన్ని రామాయణ పోగొట్టాలి

వందా రెండు వందలు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో తీస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెబుతున్న రామాయణ నుంచి ఇప్పటిదాకా సాలిడ్ వీడియో కంటెంట్ రాలేదు. ఆ మధ్య చిన్న గ్లిమ్ప్స్ వదిలారు కానీ అది కేవలం లుక్స్ పరిచయానికి మాత్రమే పరిమితమయ్యింది. ఏప్రిల్  2 హనుమాన్ జయంతి సందర్భంగా అసలైన ప్రమోషన్లను టీమ్ మొదలుపెట్టనుంది. 2 నిమిషాల 38 సెకండ్ల వీడియోని ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమయ్యింది.

ఇప్పుడు కోట్లాది కళ్ళు ఆ టీజర్ మీద ఉండబోతున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ స్థాయిని దురంధర్ పది మెట్లు పైకి ఎక్కిస్తే రామాయణ వంద మెట్లు పైకి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి మొదటి స్టెప్పు ఈ టీజరే. అందులోనూ ఈ ఏడాదే రిలీజ్ కాబట్టి బిజినెస్ పరంగా క్రేజ్ రావాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉందనే అభిప్రాయం జనంలో కలగాలి. ఖచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తి అన్ని వర్గాల్లో రేకెత్తించాలి. దర్శకుడు నితేశ్ తివారి మీద భారీ అంచనాలున్నాయి.

ఎక్స్ ట్రాడినరి అనిపిస్తేనే రామాయణ మీద బజ్ మొదలవుతుంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ సెకండ్ పార్ట్ 2028లో రిలీజవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. హిందీ సినిమాల పట్ల ఆది పురుష్ సృష్టించిన నెగటివ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఇప్పుడీ రామాయణ మీద ఉంది.

ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే యానిమల్ తర్వాత రన్బీర్ కపూర్ కి ఇదే ఫస్ట్ రిలీజ్ కానుంది. సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. సాయిపల్లవికి ఇది డెబ్యూ కాదు. జునైద్ ఖాన్ సరసన నటించిన ఏక్ దిన్ రిలీజవుతున్న నేపథ్యంలో తనకూ రామాయణ బ్రేక్ ఇవ్వడం అవసరం. ఇక కెజిఎఫ్, టాక్సిక్ లాంటి వయొలెంట్ మూవీస్ మధ్య దీన్ని ఎంచుకున్న యష్ సైతం కొత్త షేడ్ చూపిస్తా అంటున్నారు. చూడాలి మరి ఎవరెవరికి ఇది ఎలాంటి మలుపు ఇస్తుందో.

This post was last modified on March 30, 2026 8:02 pm

Share

Recent Posts

ఇండస్ట్రీ హిట్… ఎవ్వరికీ ఇవ్వవా రజినీ?

ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో…

18 minutes ago

ఆదిపురుష్ భయం.. రామాయణంను వెంటాడుతోందా?

ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం: పార్ట్1’ సినిమా. రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల…

3 hours ago

అక్క‌డ వైసీపీ జీరో నుంచి మొద‌లెట్టాల్సిందే

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల వేళ ప‌రిణామాలు చూస్తుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ జీరో అయిపోయింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి…

6 hours ago

తొమ్మిది రోజుల ముందే రామాయణం మెగా ప్రిమియర్

ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…

11 hours ago

రామాయ‌ణం డైరెక్ట‌ర్ కూడా తెలుగు సినిమా పిచ్చోడే

ఇత‌ర భాష‌లకు చెందిన సినీ జ‌నాలు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కొంచెం క‌ష్ట‌ప‌డి బాగున్నారా అని..…

12 hours ago

వైబ్ సరిపోవడం లేదు తమన్ సాబ్

ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…

12 hours ago