Movie News

ప్రాజెక్ట్ హెయిల్ మేరీ… పొగిడేంత ఏముందంటే

ఆదివారం రోజు దురంధర్ ది రివెంజ్ తర్వాత మల్టీప్లెక్సుల ప్రీమియం స్క్రీన్లలో టికెట్లు దొరకని సినిమా ఏదంటే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఒకటే. ముఖ్యంగా ప్రసాద్స్ పీసీఎక్స్, అల్లు సినిమాస్, ఏఏఏ, ఏఎంబి లాంటి చోట్ల ఏకంగా రికమండేషన్లు వాడితే తప్ప చూడలేని పరిస్థితి నెలకొంది. మూవీ చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాని తెలుగు రాష్ట్రాల థియేటర్లలో అన్నిచోట్లా ఇదే రెస్పాన్స్ ఉందనుకునేరు. కేవలం నగరాలకు మాత్రమే ఈ మేనియా పరిమితమయ్యింది.

అంతగా ప్రాజెక్ట్ హెయిల్ మేరీలో ఏముందో చూద్దాం. ఇదో సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా తీసిన సినిమా. రైలాండ్ గ్రేస్ హఠాత్తుగా నిద్ర లేస్తే తన సాటి వ్యోమగాములు చనిపోయి అంతరిక్ష నౌకలో ఒక్కడే మిగులుతాడు. ఆస్ట్రోఫేజ్ అనే వింత జీవి కారణంగా సూర్యుడి వేడి తగ్గిపోయి ప్రపంచం అంతరించే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రపంచ దేశాలు దీన్ని అరికట్టడానికి గ్రేస్ బృందాన్ని అంతరిక్షంలో పంపిస్తాయి. రాకీ అనే మరో గ్రహంతో కలిసి అతనేం చేశాడనేది అసలు స్టోరీ.

సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. ప్రతిదీ శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేశారు. ఏలియన్ గా చూపించిన రాకీ, గ్రెస్ మధ్య ఏర్పరిచిన బాండింగ్, అతని ఫ్లాష్ బ్యాక్ వగైరాలు ఆకట్టుకుంటాయి. అయితే రెండు గంటల నలభై నిమిషాల నిడివిలో సైన్స్ పాఠాలు, థియరీలు బోర్ కొట్టిస్తాయి. వీటి మీద ఆసక్తి లేని వాళ్లకు ఆ ఎపిసోడ్లన్నీ ఎప్పుడు అయిపోతాయా అనిపిస్తుంది. ఇది తట్టుకుంటేనే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అనిపిస్తుంది.

కామన్ ఆడియన్స్ కి మాత్రం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓ మాములు చిత్రంగా అనిపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇంటర్ స్టెల్లార్ స్థాయిలో ఇదో కల్ట్ గా నిలిచిపోతుందని ఆ జానర్ మూవీ లవర్స్ బల్లగుద్ది చెబుతున్నారు. అయితే గొప్ప అనుభూతి దక్కాలంటే మాత్రం మాములు థియేటర్ లో చూడకూడదు. అక్కడ మాత్రం బోర్ కొట్టే ప్రమాదముంది. దర్శక ద్వయం ఫిల్ లార్డ్ మరియు క్రిస్టోఫర్ మిల్లర్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం పొరపాటున కూడా ఆషామాషీ స్క్రీన్ కు వెళ్ళకూడదు.

This post was last modified on March 29, 2026 11:16 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

1 hour ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago