బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలె రోజు విజేత అభిజీత్, రన్నరప్ అఖిల్‌లను మించి హైలైట్ అయ్యాడు మూడో స్థానంలో నిలిచిన సోహెల్. టైటిల్ రేసు నుంచి తప్పుకుని, రూ.25 లక్షలు తీసుకుని మూడో స్థానంతో అతను సంతృప్తి చెందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తన ప్రైజ్ మనీలో రూ.10 లక్షల మొత్తాన్ని అనాథాశ్రమానికి ఇచ్చేస్తానని ప్రకటన చేయడం.. ఆ మొత్తం నాగార్జున ఇవ్వడానికి ముందుక రావడం.. బహుమతి ప్రదానోత్సవానికి వచ్చిన చిరంజీవి సోహెల్‌కు తిరుగులేని సపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ సందర్భంగా తాను ఓ సినిమా చేస్తానని.. దానికి చిరంజీవి అండగా నిలవాలని సోహెల్ కోరడం.. చిరు అవసరమైతే తాను ఆ సినిమాలో ఒక క్యామియో కూడా చేస్తాననడం తెలిసిన సంగతే.
ఐతే చిరు అలా హామీ ఇవ్వడంతో సోహెల్ ఏమాత్రం ఆగుతున్నట్లు కనిపించడం లేదు. హౌస్ నుంచి బయటికి వచ్చి నాలుగు రోజులు గడవకముందే అతను హీరోగా కొత్త సినిమా అనౌన్స్ కావడం విశేషం. శ్రీనివాస్ వింజంపాటి అనే కొత్త దర్శకుడు సోహెల్ హీరోగా సినిమా రూపొందించనున్నాడు. జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ సినిమా ఫేమ్ అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఓవైపు బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ సైతం ఇప్పటిదాకా తన కొత్త ప్రాజెక్టుల గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. అతను ఇంతకుముందు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సహా కొన్ని సినిమాలు చేశాడు. మధ్యలో కెరీర్ ఆగిపోయింది. ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోపే ‘బిగ్ బాస్’లో మూడో స్థానం సాధించిన, ఇంకా తెరంగేట్రం కూడా చేయని సోహెల్ హీరోగా సినిమా అనౌన్స్ కావడం విశేషమే. తనకు ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపును ఏమాత్రం వృథా చేయకుండా సోహెల్ భలేగా ఉపయోగించుకుంటున్నాడే అని అతడి అభిమానులు అనుకుంటున్నారు. సోహెల్ హీరోగా సినిమాకు రెడీ అయిపోతున్నాడు మరి చిరు అందులో క్యామియో చేయడానికి సిద్ధమేనా అన్నది ఇక్కడ ప్రశ్న.
This post was last modified on December 24, 2020 3:32 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…