ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ గ్యారెంటీడ్

Thaman

ఇప్పుడు తెలుగు సంగీత ద‌ర్శ‌కుల్లో త‌మ‌నే నంబ‌ర్ వ‌న్ అన‌డంలో ఎంలాంటి సందేహం లేదు. అత‌డి గ‌త సినిమాల‌కు సంగీత ప‌రంగా వ‌చ్చిన రెస్పాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్పుడు చేతిలో క్రేజీ ప్రాజెక్టులు పెట్టుకుని మ‌ళ్లీ త‌న సత్తా చాట‌డానికి రెడీ అవుతున్నాడు.

మ‌హేష్ బాబుతో స‌ర్కారు వారి పాట సినిమాతో పాటు ప‌వ‌న్ కొత్త సినిమాలు రెండింటికీ అత‌నే సంగీత ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ అత‌ను సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం నుంచి వ‌చ్చిన తొలి పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సినిమాలో అత‌డి ముద్ర ఎలా ఉంటుందో అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు సితార బేన‌ర్లో ప‌వ‌న్ చేయ‌నున్న అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేక్‌కు సైతం త‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడిగా ఖ‌రార‌య్యాడు.

ఐతే ఈ రెండు సినిమాల్లో సంగీత ప‌రంగా ప‌వ‌న్ అభిమానుల్ని ఎక్కువ ఎగ్జైట్ చేస్తున్న‌ది అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేకే. వ‌కీల్ సాబ్ ప్ర‌ధానంగా మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల చుట్టూ తిరిగే సినిమా. క‌థాంశం ప్ర‌కారం చూస్తే అందులో మాస్ మూమెంట్స్ పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ప‌వ‌న్ చేయ‌బోయే కొత్త చిత్రం వేరు. అందులో ప‌వ‌న్ పాత్ర‌కు ఎలివేష‌న్ ఓ రేంజిలో ఉంటుంది. మాతృక‌ను మించి ప‌వ‌న్ కోసం ఆ పాత్ర‌ను మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా తీర్చిదిద్దే అవ‌కాశ‌ముంది. ఒరిజిన‌ల్లో ఆ పాత్రతో ముడిప‌డ్ స‌న్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయింది.

త‌మ‌న్ దాన్ని మించిన బీజీఎం ఇవ్వ‌బోతున్నాడ‌ని ఈ సినిమాకు సంబంధించి తాజా అనౌన్స్ మెంట్ వీడియోలో స్కోర్ వింటే అర్థ‌మ‌వుతుంది. రొటీన్ టెంప్లేట్ స్కోర్ల‌ను ప‌క్క‌న పెట్టి త‌న శైలికి భిన్న‌మైన బీజీఎం ఇచ్చాడు ఇందులో త‌మ‌న్. అది వింటుంటే ప‌వ‌న్ అభిమానుల‌కు గూస్ బంప్స్ వ‌చ్చేస్తున్నాయి. అనౌన్స్ మెంట్ వీడియోకే ఇలా ఉంటే.. ఇక సినిమాలో త‌మ‌న్ బీజీఎం ఎలా మోత మోగించేస్తుందో అని ప‌వ‌న్ ఫ్యాన్స్ భారీ అంచ‌నాలే పెట్టుకుంటున్నారు.