కరోనా టైంలో ఇండియాలోని సూపర్ స్టార్లందరినీ మించి పోయి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. అష్ట కష్టాలు పడుతున్న వలస కార్మికులను వారి గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అతను అనితర సాధ్యమైన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. అందుకు తగ్గట్లే జనం అతడి మీద అపరిమితమైన అభిమానం చూపించారు.
రియల్ హీరోగా మారిన అతను.. తెర మీద విలన్ పాత్రలు చేస్తే జనం అంగీకరిస్తారా.. ఆదరిస్తారా అన్న సందేహాలు ముందు నుంచి కలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సందేహాలే నిజమయ్యాయి.
‘ఆచార్య’ సినిమాలో సోనూతో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవి ఓ ఫైట్ సీన్లో భాగంగా అతణ్ని కొట్టడానికి సంశయించారట. అలా చేస్తే జనం ఒప్పుకోరని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆ సన్నివేశాన్నే మార్చాల్సి వచ్చిందట. ఈ నేపథ్యంలో తాను ఇకపై విలన్ పాత్రలు చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సోనూ స్వయంగా వెల్లడించడం విశేషం.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా సోనూ మాట్లాడుతూ.. ‘‘కొత్త ఏడాదిని కొత్తగా ఆరంభించాలనుకుంటున్నా. ఇకపై సినిమాల్లో విలన్‌గా నటించను. నన్ను హీరోగా చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు నా దగ్గర నాలుగు అద్భుతమైన స్క్రిప్ట్స్ ఉన్నాయి. ‘ఆచార్య’ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో చిరు సార్ నా దగ్గరకు వచ్చి ‘కోవిడ్ సమయంలో ఎంతో మందికి సేవ చేసి వారి హృదయాల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నావు. యాక్షన్ సీన్స్‌లో నిన్ను కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఒక వేళ నిన్ను కొడితే ప్రజలు నాపై కోప్పడుతారు. శపిస్తారు’ అన్నారు. దీంతో ‘ఆచార్య’లో ఓ సిన్నివేశాన్ని రీషూట్ కూడా చేశాం’’ అని సోనూ సూద్ వెల్లడించాడు.
అంతటితో ఆగకుండా చిరు గురించి సోనూ ట్వీట్ కూడా వేశాడు. సినీ రంగంలో ఇప్పటివరకు తాను పనిచేసిన వారిలో ఎంతో సహృదయుడు, స్నేహశీలి ఎవరంటే అది నిస్సందేహంగా చిరంజీవేనని పేర్కొనడం విశేషం. దానికి చిరు బదులిస్తూ.. సోనూలో గొప్ప మానవత్వం ఉందని, అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ సోనూ చేస్తున్న సహాయ కార్యక్రమాలను కొనసాగించాలని పేర్కొన్న చిరు.. “నీ మనసు బంగారం సోనూ సూద్… ఇప్పుడు నీకు లభిస్తున్న ఈ గుర్తింపుకు నువ్వు అక్షరాలా అర్హుడివే” అన్నారు.
This post was last modified on %s = human-readable time difference 1:25 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…