హంతకుడి వేటలో ‘మృత్యుంజయ్’ సాహసం

తాజాగా విష్ణు విన్యాసంతో బాక్సాఫీస్ ని పలకరించిన శ్రీవిష్ణు మరో కొత్త సినిమా మృత్యుంజయ్ కేవలం వారం గ్యాప్ లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. మార్చి 6 విడుదల కాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కి శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా కాల భైరవ సంగీతం సమకూర్చారు.

తాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఫన్ స్కూలుకి భిన్నంగా శ్రీవిష్ణు ఈసారి సీరియస్ జానర్ వైపు షిఫ్ట్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఎక్స్ లో లాంచ్ అయిన ఈ ట్రైలర్లో కథ ఏంటో ఎక్కువ దాచకుండా చెప్పేశారు. అయితే అసలైన సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ చేయకుండా ఆసక్తి పెంచారు. స్టోరీ ఇంటరెస్టింగ్ గానే ఉంది.

జై (శ్రీవిష్ణు) ఎలాంటి రిస్కు అయినా ఈజీగా తీసుకునే రకం. అర్హత లేకపోయినా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో చేరాలన్నది తన లక్ష్యం. దీని కోసం ఎన్నో నేరాల్లో హంతుకులను పట్టుకోవడం కోసం మరువేషాలు వేసి, ప్రాణాలకు తెగించి మరీ అధికారులకు సహాయం చేస్తాడు.

ఈ క్రమంలో ఒక మంచి వ్యక్తి చనిపోతాడు. అతని కూతురికి జవాబు చెప్పే బాధ్యత జై మీద పడుతుంది. అతికించబడిన కాలు తప్ప హత్య చేసిన వాడి గురించి ఇంకే ఆధారాలు లేకుండా జై వేట మొదలుపెడతాడు. ఒక దశలో ఓడిపోతానా అనే భయం కూడా కలుగుతుంది. కానీ పట్టువదలకుండా గమ్యం చేరుకుని మృత్యుంజయ్ అనిపించుకుంటాడు.

విజువల్స్ చూస్తుంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ కలుగుతోంది. ఆచూకీ లేని హంతకుడిని పట్టుకునే కథలు కొత్తేమి కాదు కానీ హుసేన్ షా కిరణ్ రాసుకున్న ట్రీట్ మెంట్ కొంత వైవిధ్యంగా ఉంది. హీరోయిన్ రెబ్బా జాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.

కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ కంటెంట్ ని ఎలివేట్ చేయగా అనుభవజ్ఞులైన టెక్నికల్ టీమ్ మంచి క్వాలిటీని తీసుకురావడంలో దోహదపడింది. జనవరిలో సంక్రాంతి హడావుడి తర్వాత సరైన సీరియస్ మూవీ ఏదీ రాలేదు. మృత్యుంజయ్ ఆ లోటు తీర్చేలా ఉంది. ఆడియన్స్ ని కనక మెప్పించగలిగితే శ్రీవిష్ణు కొత్త జానర్ లో సూపర్ హిట్ దక్కినట్టు ఉంటుంది. చూడాలి.