ఎంటర్ టైన్మెంట్ కింగని అభిమానులు పిలుచుకునే శ్రీవిష్ణు కొత్త సినిమా వస్తోందంటే మినిమమ్ ఫన్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. సింగిల్ లో పెద్ద కథేం లేకపోయినా కేవలం వినోదంతో హిట్టు కొట్టేసి నిర్మాతకు లాభాలు ఇచ్చింది. సామాజవరగమన లాంటివి ఘనవిజయం సాధించాయంటే దానికి కారణం కుటుంబ ప్రేక్షకుల అండదండలు ప్లస్ యూత్ ఫాలోయింగ్.
ఈ రెండు బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నిన్న విడుదలైన విష్ణు విన్యాసంకు యునానిమస్ కాకుండా మిక్స్డ్ టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీవిష్ణు స్టోరీ సెలక్షన్ పట్ల మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .
తన టైమింగ్ వరకు శ్రీవిష్ణు కామెడీని బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ కథలో కొత్తదనం తక్కువగా ఉండటం, మీమ్స్, ట్రెండ్స్ మీద ఎక్కువగా ఆధారపడి హాస్యాన్ని రాసుకోవడం అంతగా మెప్పించలేకపోయాయి. కేవలం హీరో పెర్ఫార్మన్స్ ఏ సినిమాని నిలబెట్టలేవు.
పుష్ప ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిందంటే దానికి అల్లు అర్జున్ ఒకడే రీజన్ అనగలమా. ముందు సుకుమార్ తర్వాతే బన్నీ అంటాం. ఇద్దరూ కలిసి ప్రాణం పెట్టి తీసిన కల్ట్ అది. ప్యాన్ ఇండియా మూవీస్ కే కాదు లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న చిత్రాలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. శ్రీవిష్ణు గుర్తించాల్సింది, జాగ్రత్త పడాల్సింది ఈ విషయంలోనే.
విష్ణు విన్యాసం స్టేటస్ ఇంకా తేలలేదు. వీకెండ్ అయ్యాక ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున రాలేదు. ఏ సెంటర్స్ వరకు ఓకే కానీ టాక్ మీద పికప్ అయ్యే బిసి కేంద్రాల్లో శ్రీవిష్ణు తన సత్తా చాటడం చాలా కీలకం. అది ఏ మేరకు ఉంటుందనేది రేపటికి తేలిపోతుంది.
కాంపిటేషన్ లేకపోవడాన్ని శ్రీవిష్ణు వాడుకోవాలి. థియేటర్లలో సరైన సినిమా లేదు. చాలా బాగుందని మాట వినిపించి ఉంటే థియేటర్లను ఫుల్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. మరి విష్ణు విన్యాసాలు ఆ స్థాయిలో ఉన్నాయా అంటే సరైన సమాధానం లేదు. చూడాలి మరి వీకెండ్ ని ఏ మేరకు వాడుకోబోతున్నారో.
This post was last modified on February 28, 2026 10:55 am
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…