Movie News

నిధి అగ‌ర్వాల్ ఏమైపోయింది?

బాలీవుడ్ భామ నిధి అగ‌ర్వాల్.. టాలీవుడ్ కెరీర్ విచిత్రంగా సాగుతోంది. ఆమె తెలుగులో చేసిన తొలి సినిమా స‌వ్య‌సాచి డిజాస్ట‌ర్. అయినా మిస్ట‌ర్ మ‌జ్నులో అవ‌కాశం ద‌క్కింది. ఆ సినిమా కూడా ఆడ‌లేదు. అయినా స‌రే.. ఇస్మార్ట్ శంక‌ర్‌లో ఛాన్సొచ్చింది. తొలి రెండు సినిమాల‌కు భిన్నంగా ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది.

కానీ ఆ త‌ర్వాత ఆమెకు టాలీవుడ్లో ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రావ‌ట్లేదు. అదే సినిమాలో నిధికి దీటుగా అందాలు ఆర‌బోసిన న‌భా న‌టేష్ ఏమో క్రేజీ సినిమాల్లో ఛాన్సుల మీద ఛాన్సులందుకుంటోంది. కానీ నిధి మాత్రం క్ర‌మంగా క‌నుమ‌రుగైపోతోంది. కొత్త హీరో గ‌ల్లా అశోక్ ప‌క్క‌న ఓ సినిమా ద‌క్కించుకుంది కానీ.. ఆ సినిమా ఏమైందో ఎవ‌రికీ తెలియ‌దు. అస‌లు ఆ సినిమా పూర్త‌వుతుందో లేదో అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

దాన్ని ప‌క్క‌న పెడితే నిధికి తెలుగులో సినిమానే లేదు. టాలీవుడ్లో హీరోయిన్ల కొర‌త క‌నిపిస్తున్న స‌మ‌యంలో ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో న‌టించిన హీరోయిన్‌.. పైగా అంద‌చందాల‌కు లోటు లేని అమ్మాయికి ఛాన్సుల్లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. పెద్ద సినిమాలు కాక‌పోయినా ఓ మోస్త‌రు చిత్రాల్లో కూడా ఆమెకు చోటు ద‌క్క‌ట్లేదు. ఐతే ఆశ్చ‌ర్య‌క‌రంగా త‌మిళంలో నిధికి మంచి సినిమాలు ప‌డుతున్నాయి.
ఇప్ప‌టికే జ‌యం ర‌వి స‌ర‌స‌న భూమి అనే పెద్ద బ‌డ్జెట్ సినిమాలో నటిస్తోంది. అలాగే శింబు స‌ర‌స‌న ఈశ్వ‌ర‌న్ అనే చిత్రంలోనూ ఆమెనే క‌థానాయిక‌. ఇప్ప‌టిదాకా అన్ని సినిమాల్లో మోడ‌ర్న్ రోల్స్ చేసిన నిధి.. త‌మిళంలో మాత్రం చేస్తున్న రెండు సినిమాల్లోనూ ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌నుండ‌టం విశేషం. ఆ సినిమాలైనా బాగా ఆడి.. నిధికి త‌మిళంలో అయినా కెరీర్ అందిస్తాయేమో చూడాలి.

This post was last modified on December 20, 2020 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago