ఈ రోజుల్లో సినిమాలకు మామూలుగానే లాంగ్ రన్ ఉండట్లేదు. మంచి హైప్ తీసుకొచ్చి మెజారిటీ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం, వీకెండ్లో హౌస్ ఫుల్స్ పడితే.. సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకోవడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం. ఇలాంటి టైంలో కరోనా వచ్చి నిర్మాతల్ని దారుణంగా దెబ్బ తీసింది. వ్యాపారాన్ని మరింతగా దిగజార్చింది. ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నాయి కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో సినిమా ఎంత బాగున్నా సరే.. ఆశించిన స్థాయిలో రెవెన్యూ రావడం కష్టమే. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు అలవాటు చేయడమే సవాలుగా మారిపోయింది. ఇలాంటి టైంలో సాయిధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్‌ను రిస్క్ చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.
మిగతా నిర్మాతల్లా నార్మల్సీ కోసం ఎదురు చూడకుండా తమ సినిమాను విడుదల చేస్తున్నందుకు ప్రసాద్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఐతే ఇప్పుడు మరో సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు సైతం ఇదే రిస్క్‌కు రెడీ అయ్యారు. ఆయన తన క్రాక్ సినిమాను సంక్రాంతికి ఖరారు చేశారు. ఐతే క్రాక్ ముందు నుంచి సంక్రాంతి రిలీజే అంటున్న నేపథ్యంలో ఇందులో కొత్తేముంది అనిపించొచ్చు. కానీ దాంతో పాటు అరణ్య, రంగ్ దె, రెడ్ సినిమాలన సైతం సంక్రాంతికే షెడ్యూల్ చేశారు. కానీ వాటి రిలీజ్ విషయంలో కండిషన్స్ అప్లై అన్నమాట. సంక్రాంతికి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తాయన్న నమ్మకంతో వాళ్లు కర్చీఫ్ వేసి పెట్టారు. కానీ ఇప్పుడా సంకేతాలేమీ కనిపించడం లేదు. దీంతో ఆయా చిత్ర బృందాల నుంచి సౌండ్ లేదు. వాళ్లు విడుదలను వాయిదా వేసుకున్నట్లే.
కానీ క్రాక్ సినిమాను మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా రిలీజ్ చేద్దామనే నిర్మాత ధైర్యం చేస్తున్నాడు. సంక్రాంతికి సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకుల బలహీనత. మామూలుగా ఆ టైంలో మూణ్నాలుగు పెద్ద సినిమాలు రేసులో ఉంటాయి. వాటి స్థానంలో తమ ఒక్క సినిమా ఉంటే.. 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా మంచి వసూళ్లే వస్తాయన్నది క్రాక్ టీం ఆశగా కనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 10:59 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…