వాసి కన్నా రాశి ముఖ్యం అంటారు. ఒక దర్శకుడి పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి పదుల సంఖ్యలో సినిమాలు తీయనక్కర్లేదు. ఒక్క సినిమా తీసి అది క్లాసిక్ అనిపించుకుంటే ఆ దర్శకుడి పేరు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. అల్ఫాన్సో పుతెరిన్ అనే పేరు దక్షిణాది సినీ ప్రేక్షకులకు అలాగే గుర్తుండిపోయింది.
ప్రేమమ్ అనే ఆధునిక ప్రేమ కావ్యాన్ని అందించిన దర్శకుడు ఇతనే. మలయాళంలో తీసినప్పటికీ.. దక్షిణాదిన అన్ని భాషల వాళ్లనూ ఈ సినిమా మెప్పించింది. భాష తెలియకపోయినా.. సబ్ టైటిల్స్ లేకపోయినా కూడా ఈ సినిమా చూసి మైమరిచిపోయి.. ఆ సినిమా జ్ఞాపకాల్ని మనసుల్లో పదిలంగా దాచుకున్న ప్రేక్షకులు ఎంతమందో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా మంచి విజయం సాధించింది.
ఐతే ఇలాంటి క్లాసిక్ అందించాక అల్ఫాన్సో ఐదేళ్లకు పైగా సినిమా చేయకపోవడం ఆశ్చర్యకరం. ఇందుకు కారణాలు ఏంటో ఏమో కానీ.. ఎట్టకేలకు అల్ఫాన్సో తన తర్వాతి సినిమాకు సిద్ధమయ్యాడు. అదిరిపోయే కాస్టింగ్‌తో అల్ఫాన్సో తన తర్వాతి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ తరంలో దక్షిణాదిన గొప్ప నటుల్లో ఒకడిగా పేరు సంపాదించిన ఫాహద్ ఫాజిల్ ఇందులో హీరో కాగా.. సౌత్ హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నయనతార అతడికి జోడీగా నటించనుంది.
వీరి కలయికలో పాట్టు (తెలుగులో పాట అని అర్థం) అనే సినిమా తీయబోతున్నాడు అల్ఫాన్సో. జచారియా థామస్, అల్విన్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్లో పాత కాలం నాటి ఆడియో క్యాసెట్ కనిపిస్తుండటాన్ని బట్టి ఇది పీరియడ్ మూవీ అని అర్థమవుతోంది. ప్రేమమ్ తర్వాత దాని దర్శకుడు రూపొందిస్తున్న సినిమా కావడం, పైగా లీడ్ క్యారెక్టర్లలో టాప్ ఆర్టిస్టులను తీసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయనడంలో సందేహం లేదు.
This post was last modified on December 20, 2020 8:30 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…