పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై 2020 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ఎఫ్-2. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర అన్నీ భలేగా కలిసొచ్చేశాయి.
ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాను బాలీవుడ్ స్టయిల్లో ఒక ఫ్రాంఛైజీగా మార్చాలని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నారు. ఎఫ్-2కు కొనసాగింపుగా ఎఫ్-3 పేరుతో ఇప్పటికే సినిమాను అనౌన్స్ చేశారు. ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ నెల మూడో వారంలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. 2021 వేసవికి ఎఫ్-3ని విడుదల చేయాలన్నది ప్లాన్. ఐతే త్వరలో షూటింగ్ మొదలవుతూ ఇంకా దీని కాస్టింగ్ విషయంలో ఒక రూమర్ హల్‌చల్ చేస్తూనే ఉంది.
ఎఫ్-3లో వెంకీ, వరుణ్‌లకు తోడుగా ఇంకో హీరో కూడా ఉంటాడని.. అనిల్‌తో రాజా ది గ్రేట్ చేసిన రవితేజనే ఆ మూడో హీరో అని చాన్నాళ్ల నుంచే ప్రచారం జరుగుతోంది. దీనిపై అనిల్ కానీ, చిత్ర బృందం నుంచి ఇంకెవరు కానీ ఇంత వరకు స్పందించలేదు. దీంతో ఈ ప్రచారం నిజమే అనుకున్నారు జనాలు. ఐతే షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో మొదలవుతుండగా.. మూడో హీరో విషయంలో ఇంకా సస్పెన్స్ ఏంటని అనుకుంటుండగా.. అనిల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ సినిమాలో వెంకీ, వరుణ్ కాకుండా మరో హీరో ఉండడని.. వాళ్ల పాత్రలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశాడు. వారికి జోడీగా తమన్నా, మెహ్రీన్‌లే నటించనుండగా.. గ్లామర్ అడిషన్ మాత్రం ఉంటుందని, ఇంకో లేడీ క్యారెక్టర్‌ను తీసుకొస్తున్నారని మాత్రం చెబుతున్నారు. దీనిపై అనిల్ స్పష్టత ఇవ్వలేదు. ఎఫ్-2ను నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 20, 2020 8:22 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…