సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మంచి పాత్ర ఇస్తే దానికి జీవం పోసేయడంలో ఆమె దిట్ట. అందుకు నెట్‍ఫ్లిక్స్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన పావ కధైగళ్ చక్కని ఉదాహరణ. నాలుగు కథల సమాహారమయిన ఈ చిత్రంలో సాయి పల్లవి నటించిన సెగ్మెంట్‍కి ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ప్రకాష్‍రాజ్ కూతురిగా సాయి పల్లవి ఇందులో కనిపిస్తుంది. తండ్రికి ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిన కూతురిగా సాయి పల్లవి నటించింది.
రెండేళ్ల తర్వాత ఆమె ఆచూకీ తెలుసుకుని వచ్చిన తండ్రి కూతురు గర్భవతి కావడంతో సీమంతం చేస్తానంటూ ఇంటికి తీసుకెళతాడు. కుటుంబ పరువు తీసిందనే కోపంతో ఆమె గర్భవతి అని కూడా చూడకుండా విషం ఇచ్చేస్తాడు. కంటి ముందే కూతురు చనిపోతున్నా కానీ చలించకుండా చూస్తాడే తప్ప బ్రతికించాలని చూడడు. ఈ సెగ్మెంట్‍లో సాయి పల్లవి నటన గురించి ఇప్పుడు సోషల్ మీడియా అంతా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. విమర్శకులు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చాలా కాలం తర్వాత ప్రకాష్‍రాజ్ మళ్లీ ఒక స్ట్రయికింగ్ క్యారెక్టర్ చేసాడు. నాలుగు కథలలో ఇదే అత్యంత హృదయ విదారకంగా వుందంటూ విమర్శకులు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే మరో సెగ్మెంట్‍లో సిమ్రన్ నటన కూడా అందరి ప్రశంసలను చూరగొంటోంది.
This post was last modified on December 20, 2020 12:30 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…