Movie News

5 కోట్లకు వడ్డీతో 9 కోట్లు.. జైలు పాలైన కమెడియన్

ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. దాదాపు 16 ఏళ్ల క్రితం మొదలైన ఒక ఆర్థిక వివాదం చివరకు ఆయనను జైలు గడప తొక్కేలా చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయన విన్నపాన్ని తిరస్కరించడంతో, రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలులో లొంగిపోయారు. కోట్లాది మందిని తన కామెడీ టైమింగ్ తో నవ్వించిన నటుడు, ఇప్పుడు తన సొంత సమస్యలతో కంటతడి పెట్టుకోవడం అభిమానులను కలిచివేస్తోంది.

అసలు ఈ గొడవ 2010లో రాజ్‌పాల్ యాదవ్ దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమాతో మొదలైంది. ఆ సినిమా నిర్మాణం కోసం మురళీ ప్రాజెక్ట్స్ సంస్థ నుండి ఆయన రూ.5 కోట్ల అప్పు తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవడంతో రాజ్‌పాల్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. తీసుకున్న అప్పు తీర్చలేకపోవడం, ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడంతో వ్యవహారం కోర్టుకు చేరింది.

కాలక్రమేణా వడ్డీతో కలిపి ఆ మొత్తం దాదాపు రూ.9 కోట్లకు చేరుకుంది. రాజ్‌పాల్ యాదవ్ మధ్యమధ్యలో కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చారు, గత ఏడాది కూడా రూ.75 లక్షలు కట్టారు. అయితే పూర్తి మొత్తం చెల్లించడానికి కోర్టు ఇచ్చిన గడువులను ఆయన పాటించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన పదే పదే మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, ఫిబ్రవరి 4న న్యాయమూర్తి ఆయన పిటిషన్‌ను కొట్టేశారు.

జైలుకు వెళ్లే ముందు రాజ్‌పాల్ యాదవ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. “సార్ ఏం చేయను? నా దగ్గర పైసలు లేవు.. మరో దారి కనిపించడం లేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టకాలంలో ఎవరూ తోడుండరని, ఈ సంక్షోభాన్ని తానే ఒంటరిగా ఎదుర్కోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చివరకు లొంగిపోవాల్సి వచ్చింది. మరి ఈ కష్టాల నుంచి రాజ్‌పాల్ ఎప్పుడు బయటపడతారో వేచి చూడాలి.

This post was last modified on February 10, 2026 10:31 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

8 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

8 hours ago