క్రిష్-4.. దశాబ్దం కిందట్నుంచి చర్చల్లో ఉన్న సినిమా. హృతిక్ రోషన్ హీరోగా అతడి తండ్రి తీసిన కోయీ మిల్‌గయా పెద్ద హిట్ కాగా.. దానికి కొనసాగింపుగా ఇదే కాంబినేషన్లో రూపొందిన క్రిష్, క్రిష్-3 ఇంకా పెద్ద విజయాలు సాధించాయి. దీంతో ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా అయిన క్రిష్-4ను ఇంకా భారీగా తీయాలనుకున్నాడు రాకేష్ రోషన్.
కానీ ఒకవైపు బడ్జెట్ ఇబ్బందులు, రాకేష్ రోషన్ ఆరోగ్య సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నించాడు రాకేష్. కానీ ఆయన వల్ల కాలేదు.
ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి రాకేశ్ తప్పుకోగా.. చివరికి హృతిక్ రోషనే మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయ్యాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అయింది. వార్-2 తర్వాత ఏ సినిమా చేయకుండా కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టు కోసమే సమయం వెచ్చిస్తున్నాడు హృతిక్.
ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ బ్రేక్ పడినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్-2 ముందుకు కదలట్లేదట. హృతిక్ అండ్ టీం వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఈ సినిమాకు రూ.500 కోట్లు ఖర్చవుతుందట. అంత పెట్టి సినిమా తీసి వర్కవుట్ చేయడం కష్టమన్నది యశ్ రాజ్ ఫిలిమ్స్ భావనట.
బడ్జెట్‌ను రూ.350 కోట్లకు తగ్గిస్తే సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని నిర్మాత ఆదిత్య చోప్రా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆ మేరకు స్క్రిప్టు మార్చే పనిలో ఉందట హృతిక్ టీం. ఐతే స్క్రిప్టు మారిస్తే సినిమా స్కేల్ తగ్గిపోతుందని.. అనుకున్నంత గొప్పగా ఉండదని హృతిక్ బృందం ఆలోచిస్తోందట.
ఈ నేపథ్యంలో వేరే ఏదైనా ప్రొడక్షన్ హౌస్ రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తుందేమో అని ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నట్లు సమాచారం. అలా కాని పక్షంలో స్క్రిప్టు మార్చుకుని సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి ఇంకా సమయం పట్టొచ్చు.
This post was last modified on February 7, 2026 10:17 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…