పదహారు సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు డిజాస్టర్. నిర్మాత నాగబాబుని నిండా ముంచేసిన సినిమా. ఇప్పుడు చూస్తేనేమో కల్ట్ క్లాసిక్. మూడోసారి రీ రిలీజ్ చేసినా అభిమానులు, మూవీ లవర్స్ పొలోమని ఎగబడి థియేటర్లకు వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షోలను పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
వాటి తాలూకు వీడియోలను ఎక్స్, ఇన్స్ టాలో షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసి మెగా ఫ్యాన్సే ఆశ్చర్యపోతున్నారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఊహించని ఈ రెస్పాన్స్ కి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అయితే ఇంతగా కాలం గడిచికొద్దీ ఆరెంజ్ రుచి ఎందుకు పెరుగుతోందో అయిదు కారణాలు చూద్దాం.
మొదటిది హరీష్ జైరాజ్ సంగీతం. అప్పట్లో ఆరెంజ్ ఆడియో మాములు సెన్సేషన్ కాదు. రుబా రుబా, సిడ్నీ నగరం, హలొ రమ్మంటే వచ్చేస్తుందా, ఓ రేంజ్ లవ్విది ఓ బేబీ, నేనే నువ్వంటూ ఇలా అన్ని పాటలు యూత్ ని ఊపేశాయి. మళ్ళీ మళ్ళీ వినేలా చేశాయి.
రెండో కారణం రామ్ చరణ్ గ్రేస్. ముఖ్యంగా చాలా ఈజ్ తో డాన్స్ చేసిన విధానం క్లాస్, మాస్ ఇద్దరిని మెప్పించింది. ప్రేమలో రకరకాలుగా దెబ్బతిన్నవాడిగా చూపించిన పెర్ఫార్మన్స్ మూవీ లవర్స్ ని కట్టేసింది. మూడో కారణం టెక్నికల్ వర్క్. ఛాయాగ్రహణం, ఆర్ట్ డైరెక్షన్ బెస్ట్ క్వాలిటీ వచ్చేందుకు దోహదపడ్డాయి. అందుకే విజువల్స్ ని బాగా ఎంజాయ్ చేశారు.
నాలుగో రీజన్ జెన్ జీకి వేగంగా కనెక్ట్ అయ్యే లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. అదేదో సీరియస్ గా చెప్పకుండా భాస్కర్ మెచ్యూర్డ్ గా చెప్పిన విధానం అప్పట్లో నచ్చలేదు కానీ ఇప్పటి కుర్రాళ్లు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటే వాళ్లకు మహా ఇష్టం.
ఇక అయిదో కారణం నాగబాబు తీసుకున్న నిర్ణయం. మగధీర తర్వాత చరణ్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి రచ్చ లాంటి రెగ్యులర్ మూవీ తీయొచ్చు. కానీ ఆయన క్లాసిక్ కోరుకుని ప్రేమకథకు ఓటేశారు. అప్పుడు దాని ఫలితం రాకపోయినా ఇప్పుడు చూసి ఆస్వాదిస్తున్నారు. చూస్తుంటే ఏడాదికోసారి ఆరెంజ్ సెలబ్రేషన్స్ ఒక పండగలా మారినా ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
