గణేష్ ఆచార్య.. భారతీయ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇండియన్ సినిమా చరత్రలోనే బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లలో ఒకడు. మూడు దశాబ్దాలకు పైగా అలుపు సొలుపూ లేకుండా వందల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్.
ప్రభుదేవా, లారెన్స్ సహా చాలామంది డ్యాన్స్ మాస్టర్లు వేరే విభాగాల వైపు వెళ్లిపోయారు కానీ.. గణేష్ మాత్రం నృత్యాన్నే నమ్ముకున్నాడు. బాలీవుడ్లో అందరు బడా స్టార్లతో స్టెప్పులేయించిన ఘనత గణేష్ సొంతం. తెలుగులో ఈ తరం బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడైన అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, దువ్వాడ జగన్నాథం సినిమాలకు పని చేశాడు గణేష్. ఐతే కొన్నేళ్ల కిందట గణేష్‌ను చూసిన వాళ్లు.. ఇప్పుడు అతణ్ని చూసి గుర్తు పట్టడం కష్టమే.
విపరీతంగా బరువు పెరిగిపోయి ఒక దశలో 200 కిలోలకు చేరుకున్న గణేష్.. ఇప్పుడు వంద కిలోల బరువు తగ్గించుకుని చాలా ఏళ్ల కిందటి లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా ‘కపిల్ శర్మ షో’కు సంబంధించిన ప్రోమోలో కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐతే బేరియాట్రిక్ సర్జరీ లాంటిదేమీ చేసుకోకుండానే కేవలం వర్కవుట్లు, డైట్ ద్వారానే గణేష్ ఇంత బరువు తగ్గాడట.200 కిలోల బరువున్న తాను కొన్ని నెలల పాటు అత్యంత కఠినమైన వర్కౌట్లు చేసినట్లు ఈ సందర్భంగా గణేశ్ ఆచార్య చెప్పాడు. వ్యాయామం విషయంలో గణేష్ ఎంత కఠినంగా ఉండేవాడనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. బరువు విషయంలో గణేశ్ ఆచార్య కొన్నేళ్లుగా కృషి చేస్తున్నాడు.
This post was last modified on December 18, 2020 7:41 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…