పెద్ది మార్చి నుంచి తప్పుకుని ఏప్రిల్ చివరికి వెళ్ళిపోయాక మూవీ లవర్స్ దృష్టి ప్యారడైజ్ వైపు వెళ్తోంది. వాయిదా కన్ఫర్మ్ అయినా కొత్త డేట్ ఏంటనేది ఇప్పటిదాకా ప్రకటించకపోవడం నాని అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. నిజానికి ప్యారడైజ్ చుట్టూ పెద్ద పీటముడి ఉంది.
అదేంటంటే ఇప్పటిదాకా పూర్తయిన షూటింగ్ అరవై శాతం లోపేనట. ఇంకా చెప్పుకోదగ్గ భాగం పెండింగ్ ఉంది. పెద్ద ఎత్తున ఆర్టిస్టులు ఉండటంతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కు ఎక్కువ సమయం అవసరం కావడంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వేగంగా పరుగులు పెట్టించలేకపోతున్నారనేది ఇన్ సైడ్ టాక్. సో టైం అయితే పడుతుంది.
ఇంకోవైపు అనిరుధ్ రవిచందర్ నుంచి పాటలు రావాలి. ట్యూన్స్ ఓకే అయ్యాయి కానీ వాటి ఫైనల్ రికార్డింగ్ ఇంకా బ్యాలన్స్ ఉందంటున్నారు. అతని కాల్ షీట్ దొరకడమే పెద్ద సవాల్ గా మారిపోయిన నేపథ్యంలో రాజీ పడటం ఇష్టం ఉండని శ్రీకాంత్ ఓదెల ఎంత లేట్ అయినా సరే అనిరుద్ నుంచి బెస్ట్ రాబట్టుకోవాలనే పంతంతో ఉన్నాడట.
వచ్చే నెల హైదరాబాద్ లో అనిరుధ్ లైవ్ కన్సర్ట్ జరగనుంది. ఆలోగానే టైటిల్ సాంగ్ లేదా ఏదైనా చార్ట్ బస్టర్ అవకాశమున్న సాంగ్ ని లాంచ్ చేయాలనేది టీమ్ ఆలోచన. దానికన్నా ముందు టీజర్ వదిలే సాధ్యాసాధ్యాల గురించి అంతర్గతంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
వేసవిని మిస్ చేయకూడదనేది ప్యారడైజ్ ముందున్న టార్గెట్. ఎందుకంటే సమ్మర్ వదలుకుంటే తిరిగి ఏ దసరాకో దీపావళికో వెళ్ళాలి. అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలియదు. జైలర్ 2లాంటి వాటితో క్లాష్ అయితే పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికైతే మార్చి, ఏప్రిల్ నెలల క్యాలెండర్లు వేరే సినిమాలతో బ్లాక్ అయిపోయాయి.
ప్యారడైజ్ వీలైతే జూన్ లేదా జూలైని లక్ష్యంగా పెట్టుకోవాలి. కానీ చూస్తుంటే పరిస్థితులు అంత సులభంగా కనిపించడం లేదు. జడల్ గా నాని వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్న ప్యారడైజ్ లో మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ తండ్రి కొడుకులుగా పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
This post was last modified on February 6, 2026 11:20 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…