రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి 27 కు ఒక రోజు ముందు మార్చి 26 ఉస్తాద్ భగత్ సింగ్ అధికారికంగా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సో ఇంకో రెండు నెలల కంటే తక్కువ నిడివిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో సంబరానికి సిద్ధం కావొచ్చన్న మాట.
అయితే పెద్ది ఏప్రిల్ 30కి రావాలని ఫిక్స్ అయిపోవడంతో మెగాభిమానులు నెల తిరక్కుండానే ఇంకో గ్రాండ్ సెలెబ్రేషన్ కి రెడీ అవ్వొచ్చు. బాబాయ్ అబ్బాయ్ వరసగా ఇంత షార్ట్ గ్యాప్ లో రావడం కేవలం వాళ్ళ కోణంలోనే కాదు బయ్యర్ల యాంగిల్ లో కూడా సంతోషపడే విషయమే.
ఇక ప్రమోషన్ల పర్వం మొదలవ్వాలి. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇది చాలా కీలకం. ఎందుకంటే దీనికి రక్షగా నిలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒకటే. దర్శకుడు హరీష్ శంకర్ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ దారుణంగా పోయినప్పటికీ గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
ఇది తమిళ తేరి రీమేక్ కాదని పదే పదే చెబుతున్నారు కాబట్టి దాన్ని బలపరిచే విధంగా టీజర్ లేదా ట్రైలర్ కంటెంట్ కట్ చేయాలి. వీటికి తోడు దేవిశ్రీ ప్రసాద్ పాటలు జనంలో రిజిస్టర్ అవ్వాలి. దేఖ్ లేంగే సాలా బాగానే రీచ్ అయ్యింది కానీ దాన్ని మించే స్థాయిలో మరొక బ్యాంగర్ వీలైనంత త్వరగా వదలాలి.
ఇక పెద్ది విషయానికి వస్తే ఇంకా కొంచెం బాలన్స్ షూట్, రీ రికార్డింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా తప్పలేదు. ఇప్పుడు అదనపు సమయం దొరుకుతుంది కాబట్టి దర్శకుడు బుచ్చిబాబు మరింత శ్రద్ధగా ఫైనల్ అవుట్ ఫుట్ మీద దృష్టి పెట్టొచ్చు. అయితే మే 1 రావాలనుకున్న అఖిల్ లెనిన్ ఇప్పుడు పెద్ది డెసిషన్ వల్ల వెనుకడుగు వేస్తుందేమో చూడాలి.
ఇది కాసేపు పక్కనపెడితే ఉస్తాద్ భగత్ సింగ్ రావడానికి సరిగ్గా వారం ముందు దురంధర్ 2 ది రివెంజ్, టాక్సిక్ దిగుతున్నాయి. ఆ ప్యాన్ ఇండియా సినిమాల పోటీని తట్టుకుని పవన్ కనక గెలిస్తే వచ్చే కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on February 4, 2026 7:17 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…