Movie News

హోల్‌సేల్‌గా అమ్ముడైపోయిన నాని సినిమా?


టాలీవుడ్లో మీడియం రేంజిలో సినిమాలు చేస్తూ.. మినిమం గ్యారెంటీ రిటర్న్స్ తెచ్చే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. ముందు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నాని సినిమాలకు బిజినెస్ కూడా జరిగిపోతుంటుంది. వరుస ఫ్లాపుల నుంచి బయటపడి గత ఏడాది ‘జెర్సీ’తో హిట్ ట్రాక్ ఎక్కిన నానికి.. ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ కాస్త బ్రేకులేసింది. ఆపై ‘వి’ సినిమా సైతం అతణ్ని నిరాశకు గురి చేసింది. కానీ ఆ ప్రభావం ఏమీ నాని కొత్త సినిమాపై పడుతున్నట్లు కనిపించడం లేదు.

ప్రస్తుతం నాని తనకు ‘నిన్ను కోరి’ లాంటి మంచి సినిమాను అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడి రెండు నెలల కిందటే ఈ చిత్రం మళ్లీ పట్టాలెక్కింది. చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. చివరి దశలో ఉన్న ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ అంతా పూర్తయినట్లు సమాచారం.

ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత ‘టక్ జగదీష్’ రషెస్ చూసి ఇంప్రెస్ అయి.. ఈ సినిమాను హోల్‌సేల్‌గా కొనేసినట్లు సమాచారం. రూ.47 కోట్లకు ఈ డీల్ జరిగిందట. ఐతే ఇందులో అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ మాత్రమే ఉన్నాయా.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయా అన్నది స్పష్టత లేదు. కేవలం థియేట్రికల్స్ మాత్రమే అయితే నిర్మాతలు జాక్ పాట్ కొట్టినట్లే.

ఇంతకుముందు నాని, శివలతో ‘నిన్ను కోరి’ సినిమాను నిర్మించిన షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గరికపాటిలే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడం, టైటిల్ సహా అన్నీ పాజిటివ్‌గా కనిపిస్తుండటంతో సదరు నిర్మాణ సంస్థ భారీ మొత్తానికి సినిమాను హోల్‌సేల్‌గా కొనేసినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఇప్పుడు సినిమాలకు కష్ట కాలం నడుస్తోంది కానీ.. వచ్చే వేసవి సమయానికి సాధారణ పరిస్థితులు నెలకొని మళ్లీ జనాలు థియేటర్లలో విరగబడి సినిమాలు చూస్తారని ఆశిస్తున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నాని సినిమా మీద ఈ రేటు పెట్టడం రిస్కేమీ కాదనే అనుకోవాలి.

This post was last modified on December 17, 2020 12:28 pm

Share

Recent Posts

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

2 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

2 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

3 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

5 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

5 hours ago