లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొంతమంది తక్కువ మంది జనాలతో నామమాత్రంగా వివాహాలు జరిపించేశారు. టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కూడా ఒక దశలో తక్కువ మంది జనాలతో పెళ్లి కానిచ్చేయాలని అనుకున్నాడు.
కరోనా ప్రభావం ఓ మోస్తరుగా ఉన్న సమయంలో.. ఏం జరిగినా తన పెళ్లి ఆగదంటూ అతను ప్రకటన చేశాడు కూడా. కానీ తర్వాత కరోనా తీవ్రతను అర్థం చేసుకున్న అతను.. పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఐతే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశాక.. పరిస్థితులు సాధారణంగా మారాక నిఖిల్ పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుండేది. కానీ మళ్లీ తొందరపడ్డాడు. రెండో లాక్ డౌన్ గడువు ముగిశాక పొడిగింపు ఉండదని.. ఆంక్షలన్నీ ఎత్తేస్తారని అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే మే 14న పెళ్లికి కొత్త ముహూర్తం పెట్టుకున్నాడు.
చివరికి చూస్తే దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నిఖిల్ మరోసారి తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది తనకు చాలా ఇబ్బందికర అనుభవం అన్నాడు నిఖిల్. ఐతే జనం పడుతున్న కష్టాల ముందు తన కష్టం చాలా చిన్నదన్నాడు. ఈసారి పరిస్థితులు పూర్తిగా సాధారణంగా మారాకే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని అతను చెప్పాడు.
భీమవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ వివాహం ఖాయమైన సంగతి తెలిసిందే. నిఖిల్ గత ఏడాదే పల్లవిని కలిశాడు. ఆమెతో మాట్లాడాక తనకు సరైన జీవిత భాగస్వామి అనిపించి పెళ్లి ప్రపోజల్ పెట్టడం.. ఆమె ఓకే అనడం.. తర్వాత ఇరు కుటుంబాల నుంచి అంగీకారం రావడంతో వీరి పెళ్లికి రంగం సిద్ధమైంది. కానీ ఇంతలో కరోనా వచ్చి నిఖిల్, పల్లవి ఒక్కటి కాకుండా ఆపింది.
This post was last modified on May 3, 2020 10:46 pm
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…