Movie News

టాలీవుడ్… వెయ్యి కోట్ల క్లబ్‌పై కన్నేసిన క్రేజీ మూవీస్

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో టాలీవుడ్ సృష్టించిన ఇంపాక్ట్ తో ఇప్పుడు రాబోయే ప్రతి పెద్ద సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంటోంది. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు వేసిన బాటలో ఇప్పుడు మరికొంత మంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు పాన్ వరల్డ్ స్థాయి కథలతో సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం లైన్ లో ఉన్న చిత్రాల జాబితా చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే కనిపిస్తోంది.

అత్యంత భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ ముందు వరుసలో ఉంది. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వెయ్యి కోట్లు దాటడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాల అంచనా. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ వంటి సినిమాలు డార్లింగ్ కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ తో ఈజీగా ఆ మార్కును చేరుకునే అవకాశం ఉంది. ప్రభాస్ మార్కెట్ స్టామినా ఇప్పుడు ప్రతి సినిమాకు వెయ్యి కోట్ల పొటెన్షియల్ ను తెచ్చిపెడుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ‘RC17’ పై కూడా భారీ ఆశలు ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలవడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్టులు అట్లీ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పుష్పతో బన్నీకి ఉన్న క్రేజ్ ఈ సినిమాలకు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేలా పుష్ ఇస్తుందని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా ఒక ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ‘కేజీఎఫ్’ స్థాయి యాక్షన్ కు తారక్ పెర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. వీటితో పాటు రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, ప్రభాస్ హను రాఘవపూడి ‘ఫౌజీ’ వంటి సినిమాలు కూడా స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే ఆశ్చర్యకరమైన వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమాలన్నీ కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా విభిన్నమైన జోనర్లలో వస్తుండటం విశేషం.

అయితే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడమనేది కేవలం స్టార్ ఇమేజ్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కంటెంట్ లో దమ్ము ఉండటంతో పాటు పక్కా ప్లానింగ్ తో గ్లోబల్ లెవల్ మార్కెటింగ్ కూడా అవసరం. రాజమౌళి లాంటి దర్శకులు చూపించిన దారిలో ఈ మేకర్స్ అందరూ గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఈ భారీ ప్రాజెక్టుల్లో ఏది ముందుగా ఆ వెయ్యి కోట్ల మార్కును అందుకుంటుందో చూడాలి. టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పే ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

This post was last modified on January 31, 2026 2:07 pm

Share

Recent Posts

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

31 seconds ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

3 minutes ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

55 minutes ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

3 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

4 hours ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

4 hours ago