ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్‌డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్‌డేట్ గురించి ముందు అప్‌డేట్స్ ఇచ్చి.. అభిమానులు ఊరించి ఊరించి ఒక రకమైన అసహనానికి గురి చేస్తారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్న‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తూ.. దీని గురించి రాజమౌళి అప్‌డేట్స్ అందిస్తున్న తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
షూటింగ్ మొదలైన ఏడాది పాటు ఏ చిన్న విశేషాన్నీ పంచుకోని జక్కన్న.. గత ఏడాది ఒక భారీ ఈవెంట్ చేయడం, దానికి ఒక పాట రిలీజ్ చేయడం.. పాత్రలను పరిచయం చేయడం.. చివరికి ఒక స్టన్నింగ్ టీజర్‌తో టైటిల్, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్‌ను పరిచయం చేయడం చూసి అందరూ షాకైపోయారు. ఇదేం ప్రమోషనల్ స్ట్రాటజీరా బాబూ అంటూ వెర్రెత్తిపోయారు. ఆ టీజర్‌తో అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు కావాల్సినంత బజ్ వచ్చేసింది.
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను రాజమౌళి ప్రకటించిన తీరు.. తన మార్కెటింగ్ నైపుణ్యానికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఈ రోజుల్లో రిలీజ్ డేట్ ప్రకటన కోసం ఏదైనా ఈవెంట్ చేస్తారు. లేదంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ప్రకటన ఉంటుంది.
కానీ ఇవేవీ కాకుండా.. ‘వారణాసి’ అని టైటిల్ పెట్టుకున్నందుకు గాను వారణాసి నగరంలోనే పోస్టర్ మీద ఇంకేమీ లేకుండా కేవలం రిలీజ్ డేట్ మాత్రమే పేర్కొంటూ పోస్టర్లు పెట్టడం ద్వారా అందరి దృష్టీ అటు వైపు తిరిగేలా చేశాడు జక్కన్న.
ముందు ఆ డేట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఇది ‘వారణాసి’ రిలీజ్ డేట్ పోస్టర్ అని అర్థం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లు కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యాయి. మరోవైపు రాజమౌళి టీం అంతర్జాతీయ మీడియాకు వేరుగా ‘వారణాసి’ రిలీజ్ డేట్ గురించి సమాచారం ఇచ్చింది. రాజమౌళి లేదా మహేష్ లేదా నిర్మాణ సంస్థ నుండి రావాల్సిన పోస్టర్ అంతర్జాతీయ మీడియా ద్వారా తీసుకురావడం చూసి మహేష్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కవుట్ అయి.. అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది. ఇటు వంటి స్ట్రాటజీలు నీకే వస్తాయి, నువ్వు అసాధ్యుడివయ్యా జక్కన్నా అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on January 30, 2026 10:37 am
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…